నవ్విస్తూ భయపెడుతోన్న ఓ మంచి ఘోస్ట్ (OMG).. టీజర్ చూసేయండి!
హారర్‌కు కామెడీ తోడై నేటితరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిను తీసుకొస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 May 2024 8:45 PM ISTనవ్విస్తూ భయపెడుతోన్న ఓ మంచి ఘోస్ట్ (OMG).. టీజర్ చూసేయండి!
హారర్ సినిమాలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. భయంగా ఉన్నా సరే హారర్ సినిమాలను చూడటం చాలా మందికి ఒక సరదా. దాదాపుగా హారర్ సినిమాలు మంచి కలెక్షన్లను రాబడుతుంటాయి. అయితే.. కామెడీ మిక్స్‌డ్ హారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఈ జోనర్ సినిమాలు మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రేక్షకుల నుంచి ఆదరణ కూడా అలాగే లభిస్తుంది. ఓటీటీ పరంగా కూడా ఇలాంటి మూవీస్‌కు డిమాండ్ ఎక్కువ. ఇప్పుడిదే ఫార్ములాను నమ్ముకొని కొత్త సినిమా రాబోతుంది. హారర్‌కు కామెడీ తోడై నేటితరం ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిను తీసుకొస్తున్నారు.
మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై హాస్యభరితమైన హార్రర్ సినిమాగా తెరకెక్కుతోన్న సినిమా 'ఓ మంచి ఘోస్ట్ (OMG)'. కమెడియన్ వెన్నెల కిశోర్, నందిత శ్వేత, షకలక శకంర్‌తో పాటు పలువురు నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. శంకర్ మార్తండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా. అబినికా ఇనాబతుని నిర్మిస్తున్నారు. అనూబ్ రూబెన్స్ సంగీతం ఇస్తున్నాడు. అయితే.. తాజాగా ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు నవ్వుతూనే కాస్త భయపడుతున్నారు. థియేటర్లలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఓ మంచి ఘోస్ట్ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, లిరికల్ సాంగ్ విడుదల అయ్యాయి. వీటికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన టీజర్ నవ్విస్తూ భయపడుతోంది. పూర్వజన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే డైలాగ్‌తో టీజర్ మొదలవుతంది. ఒసెయ్ నువ్వు అరుధతికి అక్కవైనా, చంద్రముఖికి చెల్లివైనా.. కాశ్మోరాకు లవర్‌వు అయినా అంటూ కిశోర్ చేసే కామెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇలా కామెడీ.. మిక్స్‌డ్ హరర్‌తో వచ్చిన టీజర్‌కు విశేష స్పందన వస్తోంది. ఇక సినిమా విడుదలపై చిత్ర యూనిట్ త్వరలోనే ప్రకటన చేయనుంది.