చిక్కుల్లో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా, టైటిల్‌పై నోటీసులు
హీరో సాయిధరమ్ తేజ్ సినిమాకు షూటింగ్ మొదలుకాక ముందే షాక్ ఎదురైంది.
By Srikanth Gundamalla
చిక్కుల్లో సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా, టైటిల్‌పై నోటీసులు
సినిమాలపై వివాదాలు వస్తుంటాయి. ఇదంతా కామనే అయినా.. కొన్నిసార్లు అవి తీవ్రం కావడంతో సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే.. సాదారణంగా రిలీజైన తర్వాత ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ.. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాకు షూటింగ్ మొదలుకాక ముందే షాక్ ఎదురైంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
సాయిధరమ్ తేజ్ గతంలో రోడ్ యాక్సిడెంట్‌లో గాయాలపాలై కొన్నాళ్లపాటు షూటింగ్స్‌కు దూరంగా ఉన్నాడు. అయితే... అప్పటికే చిత్రీకరణ పూర్తయిన విరూపాక్ష సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. బిగ్ హిట్‌గా నిలిచింది. ఇక తాజాగా సాయిధరమ్ తేజ్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్' సినిమాను నాలుగు నెలల క్రితమే ప్రకటించారు. కానీ.. షూటింగ్ గురించి అయితే పెద్దగా అప్‌డేట్ ఇవ్వలేదు.
ఈ సినిమా టైటిల్ ప్రస్తుతం చిక్కుల్లో పడింది. చిత్రబృందానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నుంచి నోటీసులు వచ్చాయి. టైటిల్‌లో 'గాంజా' అనే పదాన్ని తొలగించాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. సినిమాలో కూడా డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నార్కోటిక్స్ అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై ఈ టైటిల్ ప్రభావం చూపించవచ్చని.. వెంటనే మార్చాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అలాంటిది ఇప్పుడు నార్కోటిక్స్ వారు నోటీసులు ఇవ్వడంతో.. ఆగిపోయిన మూవీకి నోటీసులు ఇచ్చారా అంటూ పలువురు ఆశ్చర్యపోతున్నారు.