యాక్టర్‌గా మారిన తమిళ్ స్టార్ డైరెక్టర్
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అందరికీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
By Srikanth Gundamalla
యాక్టర్‌గా మారిన తమిళ్ స్టార్ డైరెక్టర్
తమిళ్‌లో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన వరుసగా ఇండస్ట్రీ హిట్స్ అందించారు. లోకేశ్ కనగరాజ్ 'మానగరం' సినిమాతో కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కించాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి సినిమాలు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చినవే. కాగా.. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తీస్తున్నాడు. ఈ ప్రాజెక్టు విడుదలకు ముందే లోకేశ్ కనగరాజ్ అందరికీ ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
రజనీకాంత్‌తో లోకేశ్ కనగరాజ్ చేస్తున్న తలైవా 171 ప్రాజెక్టు పూర్తి కాకముందే.. ఈ స్టార్ డైరెక్టర్ యాక్టర్‌గా మారిపోయాడు. స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌తో 'ఇనిమెల్' అనే మ్యూజిక్ ఆల్బల్ చేస్తున్నాడు. ఇందులో ప్రధాన పాత్రల్లో లోకేశ్ కనగరాజ్, శృతిహాసన్ నటిస్తున్నారు. తాజాగా ఈ ఆల్బన్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. శృతిహాసన్, లోకేశ్ కనగరాజ్ కెమిస్ట్రీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లోకేశ్ కనగరాజ్‌లో ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా అంటూ నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. లోకేశ్ కనగరాజ్, శృతిహాసన్ నటిస్తోన్న ఈ ఆల్బమ్ ప్రస్తుత యువతను అట్రాక్ట్ చేసేలా ఉంది. యువత ఆలోచనలు, ప్రేమ వివాహాలు, లివ్ ఇన్ రిలేషన్ షిప్ ఆధారంగా వస్తోన్నట్లు సమాచారం. కాగా.. ఈ వీడియో ఆల్బమ్‌కు మ్యూజిక్‌తో పాటు.. కాన్సెప్ట్‌ను కూడా శృతిహాసన్ అందిస్తుందట. ఇక కమల్ హాసన్ లిరిక్స్ అందించగా.. ద్వారకేశ్ ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్నారు.