ఇక హీరోహీరోయిన్లకు నో అడ్వాన్స్: తమిళ సినీ నిర్మాతల మండలి
తమిళ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 30 July 2024 6:48 AM ISTఇక హీరోహీరోయిన్లకు నో అడ్వాన్స్: తమిళ సినీ నిర్మాతల మండలి
తమిళ సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇక నుంచి హీరోహీరోయిన్లకు అడ్వాన్స్ ఇవ్వకూడదని నిర్ణయించింది. అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని పలువురు నటీనటులపై తమిళ సినీ నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొరడా ఝుళిపించింది. అడ్వాన్స్‌లో పెద్ద ఎత్తున తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని హీరో ధనుష్‌పై ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహారంపై సినీ నిర్మాతల మండలి సీరియస్ అయ్యింది. ఇక నుంచి నిర్మాతల మండలి అనుమతుల తర్వాతే ఆయన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఆగస్టు 15 తర్వాత కొత్త సినిఆ షూటింగ్స్‌ను తమిళ సినీ నిర్మాతల మండలి ఆపేస్తున్నట్లు ప్రకటించింది. ముందు పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని ఆదేశించింది. ఆ సినిమాలన్నీ పూర్తయిన తర్వాతే కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు ఉంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సినిమాలు, ఇచ్చిన అడ్వాన్స్‌లపై నిర్మాతల మండలి నివేదిక అడిగింది. ముందు సినిమా పూర్తయిన తర్వాతే.. మరో సినిఆకు కాల్‌షీట్లు ఇచ్చేలా నిర్మాతల మండలి చర్యలు తీసుకుంటోంది. ఏ హీరోహీరోయిన్ అయినా సరే ఇక పై అడ్వాన్స్‌లు తీసుకోవడంపై నిషేధం విధించినట్లు తెలిసింది.
నిర్మాతల మండలి మరిన్ని నిర్ణయాలు:
స్టార్ యాక్టర్ల సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల
ఆగస్టు 15 తర్వాత కొత్త తమిళ సినిమా షూటింగ్స్ బంద్
అక్టోబర్ 31లోపు ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తి
నవంబర్ 1 నుండి షూటింగ్‌కు అనుమతి ఉండదు