ఆ సీన్లలో కనిపించిన హీరోయిన్లు..నెట్టింట వీరిపైనే చర్చ
స్టార్ హీరోయిన్లు కూడా OTTల్లో అందాలను ఆరబోస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 2 July 2023 11:41 AM ISTసినిమాల్లో ఏమో గానీ.. ఓటీటీలో శృంగార సీన్లకు అడ్డూ అదుపు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఓటీటీ అంటేనే బోల్డ్ కంటెంట్ ఉండాలన్నట్లుగా తయారైంది. స్టార్ హీరోయిన్లు కూడా అందాలను ఆరబోస్తున్నారు. నిర్మాతలు కూడా బోల్డ్ కంటెంట్ ఉంటే తమ సిరీస్ హిట్‌గా ఉంటుందని.. జనాలు చూస్తారని భావిస్తున్నారు. ఈక్రమంలోనే హోమ్లీగా కనిపించిన హీరోయిన్లు కూడా బోల్డ్ కంటెంట్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా.. తమన్నా, శోభిత ధూళిపాళ్ల తెగ వైరల్ అవుతున్నారు. అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.
తమన్నా దాదాపుగా అన్ని తెలుగు సినిమాల్లో హోమ్లీగానే కనిపించింది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. అయితే.. ఈ మధ్య కాలంలో ఆమెకు సినిమాలు తక్కువయ్యాయి. ఓటీటీ బాట పట్టింది. వెబ్‌సిరీసుల్లో నటించడం అంటే తెలిసిందే కదా. బోల్డ్ సీన్లలోనూ నటించాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే లస్ట్ స్టోరీస్-2లో ఆమె నటించింది. దాంట్లో తమన్నా అందాల ఆరబోత మామూలుగా లేదు. జీర్ కర్దాను మించి ఉందనే చెప్పాలి. ఉన్న కాసేపు అయినా మతిపొగొట్టేలా ఉన్నాయి బోల్డ్ సీన్లు. విజయ్ వర్మతో తమన్నా శృంగార సీన్లలో నటించింది. దీంతో మిల్కీ బ్యూటీని అలాంటి సీన్లలో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమెను ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తున్నారు.
శోభిత ధూళిపాళ్ల తెలుగు కంటే ఎక్కువగా హిందీలో సినిమాలు చూస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె కూడా నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందాలతో మత్తెక్కించింది. తమన్నా కంటే మరీ రెచ్చిపోయి నటించిందనే ప్రచారం జరుగుతోంది. జూన్ 29 నుంచి హాట్‌స్టార్ వేదికగా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి రెచ్చిపోయి ఓరేంజ్ ఇంటిమేట్ సీన్స్‌లో యాక్ట్ చేసింది. శోభిత రొమాంఇక్ సీన్స్‌కి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భలే రెచ్చిపోయింది గురూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందంటున్నారు. తెలుగులో కనిపించిన వీరిద్దరూ ఓటీటీ సిరీసుల్లో హాట్‌గా కనిపించడంతో వీరిగురించే నెట్టింట చర్చ జరుగుతోంది. కొందరైతే ఇలాంటి సీన్లలో నటించి.. అందాలను ఈ రేంజ్‌లో చూపించాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.