కాళ్లు పట్టుకున్న అభిమాని..కన్నీరు పెట్టిన తమన్నా

ఓ అభిమాని తమన్నా పాదాలను తాకాడు. ఒక లేఖను తమన్నాకు అందించాడు. ఆమె భావోద్వేగానికి గురైంది.

By Srikanth Gundamalla
Published on : 27 Jun 2023 1:43 PM IST

Tamanna, Fan Touch Foot, Tattoo

కాళ్లు పట్టుకున్న అభిమాని..కన్నీరు పెట్టిన తమన్నా

సినిమా స్టార్స్‌కు అభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే. వాళ్లు ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఆ కార్యక్రమాలకు హాజరై సందడి చేస్తారు. ఇక వీరాభిమానులు అయితే.. తమ అభిమాన హీరో, హీరోయిన్ చిత్రాన్ని పచ్చబొట్లు పొడిపించుకుంటారు. వారిని చూసినప్పుడు, కలిసినప్పుడు స్టార్స్ భావోద్వేగానికి గురవుతారు. వారు చూపించే ప్రేమకు ఎంతో ఆనందపడిపోతారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఎందురైంది హీరోయిన్ తమన్నాకు. ఎయిర్‌పోర్టులో అనుకోకుండా వీరాభిమానిని కలిసి భావోద్వేగానికి లోనైంది.

ముంబై ఎయిర్‌పోర్టులో తమన్నా కనిపించింది. ఆమెను చూసినవారంతా ఒక్క ఫొటో అయినా తీసుకోవాలని ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తమన్నా ఆగి కొందరితో ముచ్చటించింది. ఓ వీరాభిమాని మాత్రం ఊరికే కాకుండా ఒక బొకే పట్టుకొచ్చాడు.. తమన్నాకు అందజేశాడు. ఆ తర్వాత తమన్నా పాదాలను కూడా తాకాడు. ఒక లేఖను తమన్నాకు అందించాడు. ఆ సమయంలోనే తన చేతిపై తమన్నా చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకున్నది చూపించాడు. అదంతా చూసిన తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది. అతను చూపించిన అభిమానాన్ని చూసి కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత వీరాభిమానిని కౌగిలించుకుని.. ధన్యవాదాలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సదురు వీరాభిమానిని పొగుడుతున్నారు.

Next Story