భర్త గురించి సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 2 Aug 2024 8:40 AM ISTభర్త గురించి సంచలన కామెంట్స్ చేసిన తాప్సీ
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. డెన్మార్క్‌కు చెందిన మతియాస్ బో అనే వ్యక్తిని తాప్సీ పెళ్లాడిండి. తాప్సీ పెళ్లికి సంబంధించిన విషయాలేవీ బయటకు రాలేదు. తన భర్త గురించి కూడా ఆమె ఎక్కడా చెప్పలేదు. ఫోటోలను కూడా షేర్ చేయలేదు. తాప్సీ పన్ను తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో సందడి చేస్తోంది. భారత ఆటగాళ్ల మద్దతుగా నిలబడుతూ ప్రోత్సాహాన్ని అంఇస్తోంది. తాజాగాగా ఈ హీరోయిన్న్ ఫిర్ ఆయీ మసీన్ ది ల్రూబాలో నటించింది. ఇది నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆగస్టు 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తన భర్త గురించి తాప్సీ పన్ను సంచలన కామెంట్స్ చేసింది.
తన భర్త మథియాస్ బో అంటే తెలియనవారు ఉన్నారనే విషయం తెలుసుకున్నాక కొంచెం బాధగా అనిపించిందని తాప్సీ పన్ను అన్నారు. తాను పెళ్లి చేసుకున్న తర్వాత మతియాస్ బో ఎవరో చాలా మందికి తెలియదని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు బాధగా ఉండేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తాను ఎవరనేది కూడా చెప్పాలనుకోలేదని తాప్సీ చెప్పింది. అయితే అతడు ఒక క్రికెటర్ లేదా పెద్ద వ్యాపారవేత్త కాకపోవడం వలన జనాలకు తెలుసుకోవాలని అనిపించకపోవచ్చని అన్నారు. కానీ మథియాస్ ప్రపంచంలో ఉన్న దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్‌లలో ఒకడు అంతే కాకుండా ప్రస్తుతం ఒలింపిక్స్‌లో టీంఇండియా బ్యాడ్మింటన్ కోచ్ అంటూ తాప్సి పన్ను చెప్పుకొచ్చింది.
తాప్సీ పన్ను భర్త మథియాస్ బో డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇతడు 2012 సమ్మర్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. అలాగే 2015 యూరోపియన్ గేమ్స్‌లో బంగారు పతక విజేత కూడా. 2012, 2017లో రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌గా నిలిచాడు మథియాస్ బో.