తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు

తమిళనాడు తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కనిపించారు.

By Srikanth Gundamalla  Published on  1 July 2023 3:41 PM IST
Super Star, Rajinikanth, Special worship, Temple,

తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు

తమిళనాడు తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కనిపించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.'లాల్‌ సలామ్'షూటింగ్‌ తిరువణ్ణామలైలోని పరిసర ప్రాంతాల్లోనే జరుగుతోంది. ఆయన లాల్‌ సలామ్ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. దీనికి ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. సుభాస్కరన్‌ లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తలైవా ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు లైక్స్‌ కొడుతూ.. కామెంట్స్‌ పెడుతున్నారు.

రజనీకాంత్‌ చివరిసారి అన్నత్తే సినిమాలో కనిపించారు. ఈ సినిమా మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక రజనీకాంత్‌ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో 'జైలర్‌' సినిమా కూడా చేశారు. ఓ జైల‌ర్ స్టోరీ నేప‌థ్యంలో సాగే కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త‌మిళంతో పాటు ఈ మూవీని తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని స‌న్ పిక్చ‌ర్స్ వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

రజనీకాంత్‌ ప్రత్యేక పాత్ర చేస్తున్న లాల్‌సలామ్‌ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. తలైవా కూతురు 2012లో ధనుష్‌ నటించిన '3' సినిమాను డైరెక్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆమె తీస్తున్న లాల్‌సలామ్‌ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

Next Story