ట్రోలింగ్‌పై కూతురి వ్యాఖ్యలతో ఎమోషనల్ అయిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తోన్న సినిమా 'లాల్‌ సలామ్‌'.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 12:40 PM IST
rajini kanth, emotional,   aishwarya, comments ,

ట్రోలింగ్‌పై కూతురి వ్యాఖ్యలతో ఎమోషనల్ అయిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో వస్తోన్న సినిమా 'లాల్‌ సలామ్‌'. ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కాగా.. ఇందులో హీరోగా విష్ణు విశాల్‌ నటించారు. చెన్నైలో ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుక వేదికగా మాట్లాడిన ఐశ్వర్య.. రజనీకాంత్‌పై ఇటీవల వస్తోన్న ట్రోల్స్‌పై స్పందించారు. ఆమె కామెంట్స్‌ను విన్న రజనీకాంత్‌ ఎమోషనల్ అయ్యారు.

సోషల్‌ మీడియాకు తాను చాలా దూరంగా ఉంటానని ఐశ్వర్య అన్నారు. ఆన్‌లైన్‌ నెగిటివిటీ గురించి తన టీమ్ ఎప్పుడూ చెబుతూ ఉంటుందన్నారు. వాటివాల్ల తాను ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో తన తండ్రిని 'సంఘీ' అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు. అసలు సంఘీ అనే పదానికి అర్థం కూడా తనకు తెలియదని అన్నారు. ఇతరులను అడిగి తెలుసుకున్నానని అన్నారు. రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే వారిని అలా పిలుస్తారని తెలుసుకున్నట్లు చెప్పారు. రజనీకాంత్ సంఘీ కాదనీ..అలా అయితే ఆయన 'లాల్‌ సలామ్‌' మూవీలో నటించేవారే కాదని ఐశ్వర్య చెప్పారు. ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్‌ కన్నీరు పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు.

ఇక ఇదే ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో మాట్లాడిన రజనీకాంత్.. జైలర్ సినిమా విడుదల సమయంలో 'అర్థమైందా రాజా' అంటూ తాను చేసిన కామెంట్స్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. విజయ్‌పై తాను పరోక్షంగా మాటల దాడి చేశానని అంటున్నారని పేర్కొన్నారు. అలాంటి వార్తలు తననెంతో బాధించాయని రజనీ అన్నారు. విజయ్‌ ఎంతో టాలెంట్, పట్టుదల ఉన్న వ్యక్తి.. తన కళ్ల ముందే పెరిగాడని అన్నారు. తాను ఎవరితో పోటీ పడాలనుకోవడం లేదనీ.. మమ్మల్ని పోల్చి చూడొద్దనీ రజనీకాంత్ కోరారు. ఇక లాల్‌సలామ్ సినిమా కథ వెంటనే నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు రజనీకాంత్. ఈ సినిమా తప్పకుండా విజయంసాధిస్తుందని నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు.

Next Story