బిగ్‌బాస్‌ ఫినాలేకు స్టార్‌ హీరో.. !

Star Hero is the Chief guest for Bigg boss finale .. బిగ్‌బాస్‌ రియాలిటీషో.. ఇది తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైనది.

By సుభాష్  Published on  5 Dec 2020 11:27 AM GMT
బిగ్‌బాస్‌ ఫినాలేకు స్టార్‌ హీరో.. !

బిగ్‌బాస్‌ రియాలిటీషో.. ఇది తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైనది. మొదటి సీజన్‌ నుంచి ఎంతో పాపులారిటీ పొందిన ఈ షో.. ఈ నాలుగో సీజన్‌లో కూడా మంచి రేటింగ్‌తో దూసుకుపోతోంది. మొదట్లో రేటింగ్‌ పెద్ద గా లేకపోవడంతో బిగ్‌బాస్‌ నిర్వాహకులు రేటింగ్‌ పెంచే విధంగా చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి రేటింగ్‌ రేటింగ్‌లో ముందుంది. ఎన్నో ఊహాగానాలు, ఘర్షణలు, అల్లర్ల మధ్య కొనసాగిన ఈ సీజన్‌.. ఇప్పుడు తుది దశకు చేరుకుంది. హౌస్‌లో ఎక్కువగా కొత్త ముఖాలు కనిపించడంతో మొదట్లో కాస్త నెగిటివ్‌ టాక్‌ వినిపించింది. రానురాను షోను మరింత ఆసక్తిరేపేలా మలిచి అందరిన కళ్లు బిగ్‌బాస్‌ హౌస్‌పై పడేలా చేశారు నిర్వాహకులు. ముఖ్యంగా చెప్పాలంటే కంటెస్టెంట్ల మధ్య పోటీ చాలా పెరిగిపోయింది. ఫైనల్స్‌లో నిలిచేందుకు ఎవరి ఆట వాళ్లు ఆట ఆడుతూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు.హౌస్‌లో ఉన్న ఏడుగురిలో ఎవరు విజేత అవుతారా అంటే మాత్రం రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఒకరికి మించి ఒకరు గేమ్‌ ఆడుతుండటంతో ఎవరి అంచనాలు వారికి పెరిగిపోయాయి. ప్రస్తుతం బయట ఎక్కువ పాపులారిటీ పెరిగిపోతున్న కంటెస్టెంట్‌ ఎవరంటే అభిజిత్‌ అనే టాక్‌ వినిపిస్తోంది. ఇక డిసెంబర్‌ 20వ తేదీన ఫినాలే జరుగుతుందని భావిస్తున్నారు. అయితే ప్రతి సీజన్‌కు ఫైనల్‌కు ఓ స్టార్‌ హీరోను గెస్ట్‌గా ఆహ్వానిస్తున్నారు.బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో వెంకటేష్‌ను ఆహ్వానించగా, మూడో సీజన్‌లో చిరంజీవి వచ్చారు. ఈసారి గ్రాండ్‌ ఫినాలేకు గెస్ట్‌గా యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్డీఆర్‌ వస్తున్నట్లు సమాచారం. మొదటి సీజన్‌లో ఎన్డీఆర్‌ హోస్టుగా చేసిన విషయం తెలిసిందే.


ఇదిలా ఉంటే.. ఈ సారి ఫినాలేకు సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, లేదా అల్లు అర్జున్‌ వస్తే బాగుండేదని బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మరో వైపు నాలుగో సీజన్‌లో నాగ చైతన్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్‌ వినిపిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే చైతన్య భార్య సమంత, తమ్ముడు అఖిల్‌ సందడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫినాలేకు చైతన్య, సాయిపల్లవి కలిసి వస్తారని మరో టాక్‌ కూడా వినిపిస్తోంది. మరి ఫినాలేకు వచ్చే గెస్ట్‌ విషయంలో ఇన్ని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఎవరు వస్తారనేది ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఫినాలేకు ఎవరు సందడి చేస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
Next Story