మహేష్ - త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్
SSMB28 Shooting Update.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా
By Sumanth Varma k Published on 20 Jan 2023 8:29 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా 'SSMB28'. తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నిన్న సారథి స్టూడియోస్‌లో ప్రారంభమైంది, మహేష్ బాబు కూడా షూట్ లో జాయిన్ అయ్యాడు. రఫ్ అండ్ రగ్గుడ్ లుక్‌లో మహేష్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడట. ఇక నిన్నటి నుంచి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 2 వరకు ఈ షెడ్యూల్ షూట్ జరగనుంది. ఇక ఈ మూవీ కథేంటి ? జోనర్ ఏంటీ ? అనే ప్రశ్నలు అభిమానులను తొలిచేస్తున్నాయి. ఐతే, ఇదొక పొలిటికల్ అడ్వెంచర్ అని, ఇంకా స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది.
మహేష్ - త్రివిక్రమ్ గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటే.. భారీ యాక్షన్ తో పాటు భారీ తారాగణం కూడా ఉంటుంది. అందుకే, ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహేష్-పూజా కాంబినేషన్ లో మహర్షి చిత్రం తెరకెక్కింది. అది సూపర్ హిట్ అయినట్టే.. ఇది కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీలీల కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది.