సలార్ అంచనాలను మరింత పెంచేసిన శ్రియారెడ్డి కామెంట్స్

ఇప్పటి వరకు కేజీఎఫ్ మాత్రమే తెలుసు కానీ.. సలార్‌ సినిమా అంతకు మించి ఉండనుందని..

By Srikanth Gundamalla  Published on  21 Jun 2023 6:05 PM IST
Salaar, Prabhas, Prashant neel, Sriyareddy

సలార్ అంచనాలను మరింత పెంచేసిన శ్రియారెడ్డి కామెంట్స్

ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ బడ్జెట్‌ మూవీ సలార్. అయితే.. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్‌లో ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం తీరుతో ప్రభాస్‌ అభిమానులు మరింత ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పొగరు సినిమా ఫేమ్ శ్రియారెడ్డి సలార్‌ గురించి ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెప్పారు. ఆమె వ్యాఖ్యలతో సలార్‌ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇటీవల ఓ ఇంటర్వూలో శ్రియారెడ్డి పాల్గొంది. అక్కడ శ్రియారెడ్డి సలార్‌ గురించి ప్రశ్న అడగ్గా.. మనకు ఇప్పటి వరకు కేజీఎఫ్ మాత్రమే తెలుసు కానీ.. సలార్‌ సినిమా అంతకు మించి ఉండనుందని ఆమె చెప్పారు. సలార్‌ సినిమా కోసం ప్రశాంత్‌ నీల్‌ ఒక ఆరా క్రియేట్‌ చేశరాని.. అదొక కొత్త ప్రపంచమని తెలిపారు. గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌ రేంజ్‌లో ప్రభాస్‌, ప్రశాంత్‌నీల్‌ సినిమా సలార్‌ ఉండబోతుందని చెప్పారు. అయితే.. డైరెక్టర్ క్రియేట్‌ చేసిన ఆ ప్రపంచంలో ప్రభాస్‌ కింగ్‌గా ఉంటారని చెప్పారు. సినిమాలో ప్రతి సీన్, ప్రతి షాట్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తుందని అన్నారు శ్రేయారెడ్డి. దీంతో.. సలార్‌ సినిమా గురించి శ్రేయారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సలార్‌ సినిమా కోసం ఎంతో వెయిట్‌ చేస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. సలార్‌ సినిమా ఒక్కసారి థియేటర్లలోకి వచ్చాక రికార్డ్స్‌ అని బద్దలవుతాయని అంటున్నారు.

సలార్‌ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌ సినిమాలంటే అంచనాలకు భారీగానే ఉంటాయి. ఇక ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి ఈ సినిమాపై అభిమానులు ఆశలు ఎక్కువగానే పెట్టుకున్నారు. మరి రిలీజ్‌ అయ్యాక ఎలాంటి రికార్డ్స్‌ తిరగరాస్తుందో చూడాలి.

Next Story