మొక్కజొన్న విక్రయిస్తోన్న వ్యక్తితో సోనూసూద్‌ ముచ్చట వైరల్ (వీడియో)

సోనూసూద్‌ ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లారు. రోడ్డు పక్కనే ఓ వ్యక్తి మొక్కజొన్నలు విక్రయిస్తున్న వ్యక్తిని

By Srikanth Gundamalla  Published on  22 Jun 2023 9:26 PM IST
Sonusood Tweet, Corn Stall, Viral, Himachal Pradesh

మొక్కజొన్న విక్రయిస్తోన్న వ్యక్తితో సోనూసూద్‌ ముచ్చట వైరల్ (వీడియో)

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ ఎప్పుడూ ఇతరులకు సాయం చేస్తుంటారు. కరోనా సమయంలో ఎంతో మందికి హెల్ప్‌ చేసి వారికి దేవుడిలా మారారు. పలుచోట్లలో చిక్కుకున్నవారిని ఆదుకోవడంతో పాటు.. ఆకలితో ఉన్న ఎంతో మంది కడుపులు నింపారు. సోషల్‌మీడియాలో తనకు ఎవరైనా ఇబ్బందులు పడినట్లు కనిపిస్తే చాలు వెంటనే వారికి సాయం అందిస్తారు. అవసరమైన వస్తువులను కొనిస్తారు. సోనూసూద్‌ ద్వారా సాయం పొంది సంతోషంగా జీవిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే.. తాజాగా సోనూసూద్‌కి సంబంధించిన ఒక వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోనూసూద్‌ ఇటీవల హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్లారు. రోడ్డు పక్కనే ఓ వ్యక్తి మొక్కజొన్నలు కాలుస్తూ.. వాటిని విక్రయిస్తున్న వ్యక్తిని గమనించారు. అయితే.. ఆ రోడ్డు భారీ కొండల మధ్యన ఉంది. దీంతో.. సోనూసూద్‌ అక్కడ ఆగి సదురు వ్యక్తి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనాలి నుంచి ఇస్సు వైపు వెళ్తున్న రోడ్డుపై చిన్న స్టాల్ పెట్టి ఆ వ్యక్తి మొక్కజొన్నలు విక్రయిస్తున్నాడు. అతడి కష్టాన్ని చూసిన సోనూసూద్ చెలించిపోయారు. కాసేపు సదురు వ్యక్తితో మాట్లాడారు. మొక్కజొన్నల స్టాల్‌ నడుపుతున్న వ్యక్తి పేరు శేష్‌ ప్రకాశ్‌ అని.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ వాసిగా పరిచయం చేసుకున్నాడు. ఒక్కో మొక్కజొన్నను రూ.50కు విక్రయిస్తున్నానని చెప్పాడు. అతనికి కుటుంబం కూడా ఉందని తెలిపాడు. రోజంతా అక్కడే నిలబడి జీవనం కొనసాగిస్తున్నట్లు తెలిపాడు. శేష్‌ ప్రకాష్‌ చాలా కష్టపడి పనిచేస్తున్నాడని ఈ సందర్భంగా సోనూసూద్‌ అన్నారు. వ్యూయర్స్‌ అటుగా వెళ్లే వారు అతని దగ్గర మొక్కజొన్నలు కొనాలని చెప్పారు. ఆ వీడియోను సోనూసూద్ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు సదురు వ్యక్తి కష్టం గురించి రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Next Story