తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన సోనాక్షి

Sonakshi Sinha REACTS to reports of non-bailable warrant issued. సోనాక్షి సిన్హాపై ఓ చీటింగ్ కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కి చెందిన

By M.S.R  Published on  8 March 2022 2:43 PM IST
తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన సోనాక్షి

సోనాక్షి సిన్హాపై ఓ చీటింగ్ కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కి చెందిన ఏసీజేఎమ్ (అడిషనల్ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్) కోర్టు ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ పట్టణం కట్ఘర్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్ర‌మోద్ శ‌ర్మ అనే వ్య‌క్తి ఈవెంట్ లు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసి అందుకు ముఖ్య అతిథిగా సోనాక్షి సిన్హాను ఆహ్వానించాడు. ఆ కార్య‌క్ర‌మానికి సోనాక్షి సిన్హా హాజ‌రు కాలేదు. సోనాక్షికి ఆ కార్య‌క్ర‌మానికి వచ్చేందుకు రూ.37 ల‌క్ష‌లు ఇచ్చాడు. ఆమె రాక‌పోవ‌డంతో తాను ఇచ్చిన డ‌బ్బుల‌ను తిరిగి ఇవ్వాల‌ని కోరగా అందుకు సోనాక్షి మేనేజ‌ర్ తిర‌స్క‌రించాడు. సోనాక్షి సిన్హాను స్వయంగా క‌లిసి ఎన్నో సార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ప్రమోద్ మోసం కేసు దాఖలు చేశాడు. కేసు విచార‌ణ నిమిత్తం ఆమె మొరాదాబాద్‌కు రావాల్సి ఉండ‌గా ఆమె హాజ‌రు కాలేదు. దీంతో స్థానిక న్యాయ‌స్థానం ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిందని వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. నాకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఈ అంశంలో నా వివరణ తీసుకోలేదని ఆమె తెలిపారు. ఇది పూర్తిగా కల్పితం. ఒక వ్యక్తి నన్ను వేధించేందుకు కుట్ర చేస్తున్నారు. అన్ని మీడియా హౌస్ లు, జర్నలిస్టులకు నా వినతి ఏమిటంటే.. ఈ కల్పిత వార్తను ప్రసారం చేయవద్దని కోరింది సోనాక్షి. ఈ అంశం మురాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. కోర్టు ధిక్కారం కింద సదరు వ్యక్తిపై నా న్యాయ బృందం చర్యలు తీసుకుంటుందని సోనాక్షి సిన్హా తెలిపారు.

Next Story