కొత్త టాలెంట్ చూపించిన శ్రీలీల, నెటిజన్లు ఫిదా
శ్రీలీల మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తనలో ఉన్న మరో టాలెంట్‌ను బయటపెట్టింది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2023 1:18 PM ISTకొత్త టాలెంట్ చూపించిన శ్రీలీల, నెటిజన్లు ఫిదా
నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరు అంటే పూజా హెగ్డే, రష్మిక పేరో చెప్పేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరే చెబుతోంది. నటన.. అందం.. డ్యాన్స్‌తో తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈమె పేరు అభిమానులు కూడా జపం చేస్తున్నారు. తెలుగు అమ్మాయి కావడం.. ముద్దుముద్దుగా మాట్లాడుతుంటంతో ఫిదా అయిపోతున్నారు. ఇక శ్రీలీల మరోసారి అభిమానులను ఆశ్చర్యపరిచింది. తనలో ఉన్న మరో టాలెంట్‌ను బయటపెట్టింది. అభిమానులు ఆమె ప్రతిభను చూసి ఫిదా అయిపోతున్నారు. మీరు సూపర్బ్ శ్రీలీల అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
శ్రీలీల తాజాగా హీరోయిన్‌గా నటించిన సినిమా 'స్కంద'. రామ్ పొత్తినేని హీరోగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. అయితే.. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలోనే హీరోయిన్ శ్రీలీల తనలో ఉన్న కొత్త టాలెంట్‌ను పరిచయం చేశారు. పాట పాడి అభిమానులను అలరించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బృందంతో కలిసి 'స్కంద' సినిమాలోని 'నీ చుట్టు చుట్టు' పాటను ఆలపించారు. వేడుకకు హాజరైన అభిమానులు, హీరో రామ్, ముఖ్యఅతిథిగా హాజరైన బాలకృష్ణ కూడా ఆమె పాడిన పాటను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఇక శ్రీలీల సింగర్‌గాను మంచి పాటలను పాడొచ్చని అంటున్నారు.
ఇదే ఈవెంట్‌లో శ్రీలీల లవ్ ప్రపోజల్స్ గురించి ఆసక్తికరంగా.. క్యూట్‌గా మాట్లాడారు. ఏమో చూడొచ్చేమో.. ఉంటుందేమో.. అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన క్లిప్ కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. లూప్ మోడ్‌లో పాటను వింటున్నామని.. శ్రీలీల ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో అంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇదే ఫంక్షన్‌లో శ్రీలీలను ఉద్దేశించి బాలయ్య హిందీలో మాట్లాడి అలరించారు. బాలకృష్ణ కోసం జైలర్‌లోని హుకుం పాటను పాడి.. ఆయనకు బాగా సరిపోతుందని చెప్పారు.
Cutie 🥰❤️😍 #Sreeleela pic.twitter.com/s2fYcTJRXI
— The GK 🕸️ (@JusttKriSH) August 27, 2023
'స్కంద' సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి దర్శకత్వంలో వస్తుండటంతో యాక్షన్ సీన్లు భారీగా ఉంటాయని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక. అవి మరింత పెరిగాయి. ఈ సినిమాలో రెండు కోణాలు ఉన్న పాత్రలో రామ్ కనిపించనున్నారు.