'నా బాడీ.. నా క్లీవేజ్` అంటూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన సింగ‌ర్‌

Singer Sona Mohapatra Comments Goes Viral .. ఆ హాట్ సింగర్ లేటెస్ట్ కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `

By సుభాష్  Published on  25 Nov 2020 1:10 AM GMT
నా బాడీ.. నా క్లీవేజ్` అంటూ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన సింగ‌ర్‌

ఆ హాట్ సింగర్ లేటెస్ట్ కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. `నా బాడీ.. నా క్లీవేజ్ నా ఇష్టం' అనేయడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా ఫికర్ చివరికి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఎవరా సింగర్ అంటే.. పేరు సోనా మోహపాత్రా.

మీటూ వేధింపులు అనే టాపిక్ ని ప్రస్థావిస్తూ .. తన కాలేజ్ డేస్ లో ఎదురైన అనుభవాన్ని సోనా మోహ‌పాత్ర త‌న గ‌తంలోని ఓ సంఘ‌ట‌న‌ను గురించి చెప్పింది. "నా బీటెక్ టైంలో నా ల్యాబ్ మీదుగా ముందుకు వెళ్తున్నాను.. ఆ స‌మ‌యంలో లూజ్ కుర్తా.. స‌ల్వార్ ధ‌రించాను.. సీనియ‌ర్స్ నన్ను చూసి విజిల్స్ వేశారు.. నా బ్రా సైజ్ గురించి వారు గ‌ట్టిగా అరిచారు. నా స్నేహితుడొక‌డు నా ద‌గ్గ‌రికి వ‌చ్చి.. నా దుప్ప‌ట్టాను ఎందుకు స‌రిగ్గా ధ‌రించ‌లేద‌ని అడిగాడు.. ఎందుకు వాటిని క‌వ‌ర్ చేసుకోకుండా వేసుకున్నావ్ అని అడిగాడంటూ" సోనా మోహ‌పాత్ర త‌న‌కు జ‌రిగిన ఘ‌ట‌న గురించి వివ‌రించింది. త‌న‌కు జ‌రిగిన ఘ‌ట‌న‌ను వివ‌రిస్తూ.. మిగ‌తా వారిని కూడా చెప్ప‌మ‌ని కొంద‌రిని ట్యాగ్ చేసింది.

సోనా ట్వీట్‌పై స్పందిస్తూ.. నెటిజనుల్లో ఒక విభాగం ..ప్రచారం కోసం ఆకలితో ఉన్నందున ఆమె ఇలాంటివి రాసిందని ట్రోల్ చేశారు. కొందరు అయితే మోనా చెప్పినదానితో ఏకీభవించి వారి అభిప్రాయాలను అనుభవాలను పంచుకున్నారు. సీనియర్లు.. మేల్ క్లాస్ మేట్స్ మీ అందాల పరిమాణం గురించి అంతులేని రాత్రుల్లో మాట్లాడుకున్నారు. ఓ నెటీజ‌న్ స్పందిస్తూ.. మీరు షేర్ చేసే అన్నీ ఫోటోల్లో క్లీవేజ్ క‌నిపిస్తాయి.. ముందు అది చూసుకోండ‌ని హిత‌వు ప‌లికాడు. "అది నా బాడీ.. నా ఇష్టం నా క్లీవేజ్‌.. నాకు న‌చ్చిన‌ట్టుగా ఉంటాను "అంటూ రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చింది.Next Story
Share it