సిల్క్‌ స్మిత లైఫ్‌పై మరో బయోపిక్.. ఎవరు నటిస్తున్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్రేడ్‌ డ్యాన్సర్‌గా దివంగత సిల్క్‌ స్మిత పేరు సంపాదించుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  2 Dec 2023 4:15 PM IST
silk smitha, biopic, upcoming movie, chandrika ravi,

సిల్క్‌ స్మిత లైఫ్‌పై మరో బయోపిక్.. ఎవరు నటిస్తున్నారంటే..

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్రేడ్‌ డ్యాన్సర్‌గా దివంగత సిల్క్‌ స్మిత పేరు సంపాదించుకున్నారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ సహా మరికొన్ని భాషల్లోనూ నటించారు. డ్యాన్సర్‌, నటిగా రాణించారు స్కిల్‌ స్మిత. ఎక్కువగా సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌.. రొమాంటిక్ పాత్రల్లోనే కనించిరు. అంతేకాదు.. సిల్క్‌ స్మిత ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాల్లో కనిపించి రికార్డు కూడా క్రియేట్‌ చేశారు. 1979 నుంచి సుమారు 20 ఏళ్ల పాటు సిల్క్‌ స్మిత హవా కొనసాగింది. స్టార్‌డమ్‌ను చూసిన ఆమె.. 1996లో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆమె లైఫ్‌పై మరో బయోపిక్‌ తెరకెక్కనుంది.

డిసెంబర్‌ 2న సిల్క్‌ స్మిత జయంతి. ఆమె పుట్టినరోజు సందర్భంగానే బయోపిక్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే.. సిల్క్‌ స్మిత్‌ పాత్రలో చంద్రిక రవి నటించనున్నారు. చంద్రిక వీరసింహారెడ్డి సినిమాలో స్పెషల్‌ సాంగ్ చేశారు. తాను సిల్క్‌ స్మిత క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్‌)వేదికగా ప్రకటించారు. సిల్క్‌ స్మితగా చంద్రిక ఉన్న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. అన్‌టోల్డ్‌ స్టోరీ అనే క్యాప్షన్ ఇచ్చారు. సిల్క్‌ బయోపిక్‌ మూవీకి జయరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌బీ విజయ నిర్మాణంలో తెరకెక్కుతోంది.

జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు స్కిల్‌ స్మిత. 35 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 1996లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేది ఇప్పటికీ తేలలేదు. మిస్టరీగానే మిగిలిపోయింది. కాగా.. గతంలో సిల్క్‌ జీవితంపై బాలీవుడ్‌లో ఇప్పటికే 'డర్టీ పిక్చర్‌' వచ్చింది. విద్యాబాలన్‌ ఆమె పాత్రలో నటించారు. ఇప్పుడు మరో బయోపిక్‌ వస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం బాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Next Story