siima awards-23: ఉత్తమ నటుడు ఎన్టీఆర్, ఉత్తమ నటి శ్రీలీల

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 వేడుక అట్టహాసంగా జరిగింది.

By Srikanth Gundamalla  Published on  16 Sept 2023 8:05 AM IST
siima awards 2023, Dubai, best Actor, Junior NTR,

siima awards-23: ఉత్తమ నటుడు ఎన్టీఆర్, ఉత్తమ నటి శ్రీలీల

దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్‌ (సైమా) 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనుంది. సెప్టెంబర్ 15, 16 రెండ్రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. అయితే.. ఈ వేడుకల్లో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చితర పరిశ్రమకు చెందిన నటీనటులు సందడి చేశారు. సైమా-2023 అవార్డులను ప్రకటించారు.

సైమా అవార్డ్స్‌ -2023 వేడుకల్లో నటీనటులు సందడి చేశారు. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన కథానాయికలు ట్రెండీ దుస్తుల్లో రెడ్‌ కార్పెట్‌పై తళుక్కున మెరిశారు. ఈ అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్‌లో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా హవాను కొనసాగించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డులు దక్కాయి. దీని తర్వాత ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీతో వచ్చిన సినిమా 'సీతారామం'కు మూడు అవార్డులు దక్కాయి.

సైమా అవార్డ్స్‌-2023లో ఉత్తమ నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. అలాగే 'ధమాకా' సినిమాకు గాను హీరోయిన్ శ్రీలీలకు ఉత్తమ నటి అవార్డు లభించింది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. తనకు వచ్చిన అవార్డుకు అభిమానులే కారణమని.. వాళ్లందరికీ పాదాభివందనం చేస్తున్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

సైమా అవార్డులు-2023 అవార్డుల విజేతలు:

ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)

ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)

ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)

ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)

ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)

ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)

ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)

ఉత్తమ గాయని: మంగ్లీ

ఉత్తమ నూతన హీరో: అశోక్ గల్లా (హీరో)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు)

ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)

ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)

సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)

ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌

ప్రామిసింగ్ స్టార్: బెల్లంకొండ గణేష్

ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

Next Story