సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన అదితి రావు హైదరీ
సిద్దార్థ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అదితి రావు హైదరీ... 'అతను ఎస్ చెప్పాడు' అంటూ ట్యాగ్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 28 March 2024 4:23 PM ISTసిద్ధార్థ్‌తో రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చిన అదితి రావు హైదరీ
స్టార్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారనీ.. తెలంగాణలోనే వీరి వివాహం సీక్రెట్‌గా జరిగిపోయిందని వార్తలు వినిపించాయి. బుధవారం మొత్తం వీరి వివాహానికి సంబంధించిన వార్తనే హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఇవన్నీ వార్తలే అని కొందరు అనుకున్నారు. న్యూస్ తెగ వైరల్ అయినా కానీ బుధవారం సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ఎవరూ స్పందించలేదు. కానీ.. తాజాగా ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేసింది హీరోయిన్ అదితి రావు హైదరి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఫొటో షేర్ చేసింది.
సిద్దార్థ్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అదితి రావు హైదరీ... 'అతను ఎస్ చెప్పాడు' అంటూ ట్యాగ్ ఇచ్చింది. ఎంగేజ్‌డ్ అంటూ రాసుకొచ్చింది. దాంతో.. పెళ్లి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో కొంత వాస్తవం ఉందని అర్థం అయిపోయింది. అదితిరావు హైదరీ పోస్టు చేసిన ఫొటోను గమనిస్తే వారి పెళ్లి జరిగిపోయిందనేది వాస్తవం కాదని తెలుస్తోంది. కానీ.. వీరి ఇద్దరి చేతులకు మాత్రం రింగ్స్ కనిపిస్తున్నాయి. అవి కనిపించేలా ఫొటోకు ఫోజు ఇచ్చారు. దాంతో.. ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఎంగేజ్‌డ్ అంటూ అదితిరావు రాసుకురావడం దీనికి బలాన్ని ఇస్తున్నాయి.
కాగా.. సిద్ధార్థ్, అదితారావు హైదరీ విషయానికి వస్తే కొంతకాలంగా వీళ్లు రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. కొన్ని సందర్భాల్లో ఇద్దరూ కలిసి కనిపించారు. 'మహాసముద్రం' సినిమాకు ఇద్దరూ కలిసి పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఇద్దరూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఆ మధ్య హీరో శర్వానంద్ వివాహ వేడుకకు కూడా కలిసి వెళ్లడంతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా అదితి రావు హైదరీ ప్రకటనతో క్లారిటీ వచ్చింది.