శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘోస్ట్‌' నుంచి 'బిగ్‌ డాడీ' టీజర్‌ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తాజా చిత్రం 'ఘోస్ట్' నుంచి మేకర్స్‌ బిగ్‌ డాడీ టీజర్‌ను విడుదల చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 July 2023 4:15 PM IST
Shivaraj Kumar, Birthday, Ghost Movie, Teaser,

శివరాజ్‌కుమార్ యాక్షన్ థ్రిల్లర్ 'ఘోస్ట్‌' నుంచి 'బిగ్‌ డాడీ' టీజర్‌ విడుదల

కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్ తన తాజా చిత్రం 'ఘోస్ట్'. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్యాన్ ఇండియా బరిలో దిగనున్నారు. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి, ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఈ సినిమాకు దర్శకుడు. ప్రముఖ రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రచార చిత్రం అంచనాలు పెంచేసింది. దీంతో.. ఘోస్ట్‌ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే.. శివరాజ్‌ కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా జూలై 12న ఈ సినిమా మేకర్స్‌ బిగ్‌ డాడీ టీజర్‌ను విడుదల చేశారు.

ఒక పాడుబడ్డ బిల్డింగ్‌ను ఆయుధాలతో ఉన్న కొందరు వ్యక్తులు చుట్టుముట్టడంతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. వారికి సూచనలు చేసే వారు ఆ బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తి ప్రాణాలతో కావాలి..అతనితో జాగ్రత్తగా ఉండాలంటూ వార్నింగ్‌ ఇస్తుంటారు. శివరాజ్‌ కుమార్‌ బిల్డింగ్‌లో కూర్చొని పానీపూరీ స్టైల్‌లో ఆల్కాహాల్‌ పూరీ తింటూ వీళ్ల కోసమే ఎదురు చూస్తుంటాడు. ఆయుధాలతో చుట్టుముట్టి కదిలితే కాల్చేస్తాం అంటూ వార్నింగ్‌ ఇస్తారు. దాంతో.. శివరాజ్‌ కుమార్‌ తన చేతిలో ఉన్న మందు గ్లాస్‌ వెనకున్న బ్లాక్‌ క్లాత్‌పై పడేసి.. చేతిలో ఉన్న సిగరెట్‌ను కూడా విసిరేస్తాడు. దాంతో.. క్లాత్‌ కాలిపోయి మంటలు చెలరేగుతాయి. క్లాత్‌ కాలిపోవడంతో బిగ్‌ డాడీ రివీల్ అవుతుంది. ఇక క్లాత్‌ వెనుక భారీ యుద్ధ ట్యాంకర్‌ ఉంటుంది. అది చూశాక శివరాజ్‌ కుమార్‌ను పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తులు షాక్‌ అవుతారు. వారి నోటివెంట మాట కూడా రాకుండా పోతుంది. చివరగా శివరాజ్ కుమార్‌ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ చెప్తారు. 'మీరు గన్నుతో ఎంత మందిని భయపెట్టారో అంతకంటే ఎక్కువ మందిని నేను నాకళ్లతో భయటపెట్టాను. దే కాల్‌ మీ ఓజీ.. ఒరిజినల్‌ గ్యాంగ్‌ స్టర్‌' అని డైలాగ్‌తో టీజర్ ముగిసింది.

శివరాజ్‌కుమార్‌ అద్భుతమైన నటన, సూపర్‌ స్వాగత్‌తో టీజర్‌లో ఎంతో ఆకట్టుకున్నారు. అర్జున్‌ జన్య అందించిన పవర్‌ఫుల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్, యాక్షన్‌ ఫిలింకు తగ్గ లైటింగ్‌ మూడ్‌ను అందించిన సినిమాటోగ్రాఫర్ మహేష్‌ సింహా పనితనం ఎంతో ఆకట్టుకుంది. బిగ్‌డాడీగా వార్‌ టాంకర్‌నే తెచ్చిన దర్శకుడు శ్రీని విజన్‌ను సినిమా నిపుణులు మెచ్చుకుంటున్నారు. శ్రీని 'ఘోస్ట్‌' సినిమాను ఏ రేంజ్‌లో చిత్రీకరిస్తున్నాడో టీజర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఇక నిర్మాత సందేశ్ నాగరాజ్‌ భారీ బడ్జెట్‌తో ఘోస్ట్‌ను టెక్నికల్‌గా హైరేంజ్‌లో నిర్మిస్తున్నారు.

ఘోస్ట్‌ సినిమాలో నటులు అనుపమ్‌ ఖేర్, జయరామ్‌, ప్రశాంత్ నారాయణ్, అర్జన జాయిస్, సత్య ప్రకాశ్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story