అంత పాపులర్ టీవీ షోలో మెయిన్ నటుడైనా.. ఆయనకు అవకాశాలే లేవట

Shivaji Satam aka ACP Pradyuman of CID opens up on narrowing work offers.సీఐడీ.. ఎంత పాపులర్ షోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన

By M.S.R  Published on  19 Jan 2022 1:51 PM IST
అంత పాపులర్ టీవీ షోలో మెయిన్ నటుడైనా.. ఆయనకు అవకాశాలే లేవట

సీఐడీ.. ఎంత పాపులర్ షోనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో భాషల్లో ఈ టీవీ సీరియల్ డబ్ అయి ఉర్రూతలూగించింది. ఎసిపి ప్రద్యుమన్, దయా వంటి ప్రముఖ పాత్రలను నేటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు. సీరియల్‌లోని 'తోడ్ దో దర్వాజా దయా, కుచ్ తో గడ్బడ్ హై దయా' వంటి డైలాగ్‌లు ఇప్పటికీ ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఈ సిరీస్‌లో మరాఠీ నటుడు శివాజీ సతం ఏసీపీ ప్రద్యుమన్‌గా నటించారు. 'సిఐడి' సిరీస్ ముగిసినప్పటి నుండి శివాజీ కు పెద్దగా అవకాశాలు రావడం లేదట..! ఆయనకు చిన్న మరియు పెద్ద స్క్రీన్‌లకు దూరంగా ఉంటున్నారు. అంతకు ముందు శివాజీ అనేక హిందీ-మరాఠీ చిత్రాలలో నటించారు. కానీ 'సిఐడి' సిరీస్ వల్ల ఆయనకి నిజమైన గుర్తింపు వచ్చింది. ఏసీపీ ప్రద్యుమ్న రూపంలో ఆయనకు నేషనల్ లెవల్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది. శివాజీ అని కాకుండా ఇప్పటికీ ఆయనను ఏసీపీ ప్రద్యుమన్‌గా ప్రజలు పిలుస్తున్నారు. శివాజీ స‌తం ప్ర‌స్తుతం పని కోసం వెతుకుతున్నారు. శివాజీ స‌తం 'సీఐడీ' సిరీస్‌ తర్వాత చాలా సినిమాల్లో పనిచేయాలనుకుంటున్నారు. కానీ అనుకున్న అవకాశాలు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు.

హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 'నేను మళ్లీ పని చేయాలనుకుంటున్నాను. కానీ అదే పాత్ర నాకు నచ్చదు. అలా అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నాకు ప్రస్తుతం ఆఫర్‌లు లేవు. ఇది నిజం. ఇలా చెప్పడానికి నేను సిగ్గుపడను. నాకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయి. కానీ నాకు నచ్చలేదు. నాకు ఏదో కావాలి. నేను మరాఠీ థియేటర్‌లో పనిచేశాను. అందుకే నాకు ఆసక్తి ఉన్న పాత్రలనే ఎంచుకుంటాను' అని అన్నారు. మళ్లీ ఏసీపీ ప్రద్యుమ్న పాత్ర వస్తే ఒప్పుకుంటారా? అని అడగ్గా.. ఈ పాత్ర దొరికితే ఒప్పుకుంటాను.. బోర్ కొట్టకుండా ఈ పాత్రలో నటించగలను.. మళ్లీ సీఐడీ సీరీస్ మొదలైతే కచ్చితంగా ఏసీపీ ప్రద్యుమ్న పాత్రలో నటించాలనుకుంటున్నానని తెలిపారు. కరోనా కారణంగా పని లేకుండా పోయింది. ఇంట్లో కూర్చొని అలసిపోయానని ఆయన అన్నారు.

Next Story