శిల్పాశెట్టితో ఆమె భర్త విడిపోవట్లేదు.. రాజ్‌కుంద్రా ట్వీట్‌కి కారణం ఇదే..
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది.
By Srikanth Gundamalla Published on 20 Oct 2023 9:15 AM GMTశిల్పాశెట్టితో ఆమె భర్త విడిపోవట్లేదు.. రాజ్‌కుంద్రా ట్వీట్‌కి కారణం ఇదే..
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఎక్స్ (ట్విట్టర్)లో పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. 'మేం విడిపోతున్నాం. ఈ కష్టమైన తరుణంలో మాకు అండగా ఉండండి’ అంటూ హార్డ్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు రాజ్ కుంద్రా. దీనితో నెటిజన్లు షాక్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చి ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రాజ్‌కుంద్రా తాజాగా 'యుటి69' అనే చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్నారు. అయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగానే ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్నే తన భార్య శిల్పాశెట్టితో చెప్పగా ఆమె మీదకు చెప్పు విసిరేసిందట. దాంతో.. కొద్ది రోజులకు దర్శకుడు కథ చెప్పడంతో ఒప్పుకున్న శిల్ప మూవీ చేసేందుకు అంగీకారం తెలిపిందట. ఇదంతా ముంబైలో ఇటీవలే జరిగిన 'యుటి 69' స్నీక్‌పీక్ లాంచ్‌లో వెల్లడించారు. అయితే.. అంతలోనే రాజ్‌కుంద్రా హార్ట్ బ్రేక్ ఏమోజీతో ఒక పోస్టు పెట్టారు. ఇంతలోనే ఏం జరిగిందంటూ నెటిజన్లు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే.. రాజ్‌కుంద్రా తన పోస్టులో ఎలాంటి పేరు ప్రస్తావించలేదు. అలా ఎలాంటి పేరు చెప్పకపోవడంతో నెటిజన్లే పలుపలు రకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు విడాకులకు సంబంధించిన ట్వీట్ అనరి.. ఇంకొందరు అయితే విడాకుల గురించి కాదంటూ వివరణలు ఇస్తున్నారు.
రాజ్‌కుంద్ర కొద్ది నెలలుగా ఫేస్‌కి హెల్మెట్ లాంటి మాస్క్ ధరించే బయటకు వస్తున్నారు. దాంతో.. మాస్క్ ఇక నుంచి ఉండదని.. అందుకే ఆ ట్వీట్ పెట్టారంటూ చెప్పుకొస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్‌తో క్లారిటీ వచ్చింది. "ఫేర్‌వెల్ మాస్క్.. సెపరేట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. రెండేళ్లగా నన్ను రక్షిస్తునందుకు థ్యాంక్స్. 'యుటి 69'తో నా జర్నీలో కొత్త ఫేజ్ ప్రారంభం కాబోతుంది’’ అని పేర్కొన్నారు. రాజ్‌కుంద్రా కొత్త ట్వీట్‌తో శిల్పాశెట్టి అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ట్వీట్ విడాకుల కోసం కాదనీ.. ఫేస్ మాస్క్ కోసమే అని అర్థం చేసుకున్నారు. ప్రస్తుతం రాజ్‌కుంద్రా కలెక్ట్ చేసిన ఫేస్ మాస్క్‌ల వీడియో కూడా వైరల్ అవుతోంది.
We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔
— Raj Kundra (@onlyrajkundra) October 19, 2023
Farewell Masks …it’s time to separate now! Thank you for keeping me protected over the last two years. Onto the next phase of my journey #UT69 🙏🎭🥹 🧿😇❤️ pic.twitter.com/svhiGS8aHt
— Raj Kundra (@onlyrajkundra) October 20, 2023