ఓటీటీలోకి షారుఖ్ 'జవాన్'.. థియేటర్‌లో లేని సీన్లు కూడా...
జవాన్ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 Oct 2023 8:16 AM GMTఓటీటీలోకి షారుఖ్ 'జవాన్'.. థియేటర్‌లో లేని సీన్లు కూడా...
బాలీవుడ్‌లో షారుక్‌ఖాన్ సంచలన విజయాలను అందుకున్నాడు. ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాలు బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన పఠాన్ సినిమా కోత సృష్టించింది. ఇక సెకండాఫ్‌లో వచ్చిన జవాన్ కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో జవాన్ మూవీ కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇప్పటికే రూ.1,150 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలోనే రికార్డును నెలకొల్పింది. ఇక నెట్ లెక్కలు చేసుకుంటే.. రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. పఠాన్ కూడా వెయ్యి కోట్లను రాబట్టాడు. కానీ.. తన రికార్డులను తానే జవాన్ ద్వారా వెనక్కి నెట్టాడు. జవాన్ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. షారుక్‌ఖాన్ జవాన్ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ నవంబర్ 2వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. అయితే.. థియేటర్లలో చూసినవారు కూడా మళ్లీ చూడాలి. ఎందుకంటే కత్తెర పడిన చాలా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఇదే టాక్ నడుస్తోంది. ఓటీటీలో జవాన్ లెంగ్త్ 3 గంటల పైనే ఉంటుందని అంటున్నారు. అయితే.. థియేటర్లో మాత్రం ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉండింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు.
ఎప్పుడూ లేనిది సౌత్ ఇండియాలో కూడా షారుఖ్ సినిమాకు రీజినల్ భాషల్లో కోట్లుల్లో కలెక్షన్‌లు వచ్చాయి. సౌత్‌లో ఆహా ఓహా అన్న రేంజ్‌లో పర్‌ఫార్మెన్స్ చేయలేదు కానీ.. హిందీ ఆడియెన్స్ మాత్రం షారుఖ్ యాక్షన్, అట్లీ డైరెక్షన్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ కనిపించింది. విజయ్ సేతుపతి విలన్‌గా నటించగా.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు.