చరణ్‌ సంగీత్‌ టైమ్‌లో ఇంత పెద్ద సంఘటన జరిగిందా? చిరు ఏం చేశారంటే..

రామ్‌చరణ్‌, ఉపాసన సంగీస్‌ సమయంలో ఒక సంఘటన జరిగింది. మందుగానే సంగీత్‌కు పెద్ద కూతురు వెళ్లిపోయింది.

By Srikanth Gundamalla
Published on : 21 Jun 2023 11:48 AM IST

Megastar Chirajeevi, Granddaughter Journalist Prabhu,

చరణ్‌ సంగీత్‌ టైమ్‌లో ఇంత పెద్ద సంఘటన జరిగిందా? చిరు ఏం చేశారంటే...

రామ్‌చరణ్‌, ఉపాసన సంగీస్‌ సమయంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. మందుగానే సంగీత్‌కు పెద్ద కూతురు వెళ్లిపోయింది.మెగాస్టార్‌ చిరంజీవి.. టాలీవుడ్‌కే కాదు, ఇండియన్‌ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. మెగాస్టార్‌ మామూలు మనిషి కాదు.. మహానుభావుడు అంటుంటారు అభిమానులు. ఆయన్ని రోల్‌మోడల్‌గా తీసుకుని ఎందరో సినీ ఇండస్ట్రీకిలో వచ్చారు. తమ టాలెంట్‌ చూపించి పేరు సంపాదించుకున్నారు. చిన్న హీరోలు కూడా ఆడియో, సినిమా ఫంక్షన్లకు రావాలని పిలిస్తే నో చెప్పకుండా వెళ్లే గొప్ప మనసున్న వ్యక్తి చిరంజీవి. ఆయనకు ఉన్న సాయం చేసే గుణం ఇక ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలను కూడా ఎంతో ఇష్టపడతారు. అందరినీ తన కుటుంబంలా భావిస్తారు. అయితే.. రామ్‌చరణ్‌ సంగీత్‌ సమయంలో అనుకోని సంఘటన జరిగిందట. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఆ రోజు నిద్రలేని రాత్రి గడిపారట. కంటి నిండి నీళ్లు పెట్టుకున్నారట. ఎక్కువ మందికి తెలియని విషయాన్ని సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

ఇంటర్వూలో సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు మాట్లాడుతూ.. మెగాస్టార్‌ చిరంజీవికి పిల్లలంటే ఎంతో ఇష్టం.. రామ్‌చరణ్‌, ఉపాసన సంగీస్‌ సమయంలో జరిగిన సంఘటన ఒకటి చెప్పారు. మందుగానే సంగీత్‌కు పెద్ద కూతురు వెళ్లిపోయింది. సంగీత్‌కు చిరంజీవి బయల్దేరుతున్న సమయంలో పెద్ద మనవరాలు ఉన్నట్లుండి కళ్లు తిరిగి కింద పడిపోయింది. దీంతో వెంటనే చిరంజీవి పరిగెత్తుకుని వచ్చి ఏమైందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే కారులో ఎక్కించుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దారి మధ్యలోనే అపోలో ఆస్పత్రికి ఫోన్ చేసి విషయం చెప్పారు. చిరంజీవి అక్కడికి వెళ్లే సమయానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. పాపకు ఏం జరిగిందనే టెన్షన్‌లో ఉండిపోయారు. వైద్యులు చికిత్స చేస్తుండగా పాప ఏడ్చింది. ఒక్కసారిగా ఏడవటంతో స్పృహలోకి వచ్చింది. వైద్యులు పాపకు డేంజర్‌ లేదని చెప్పారు. ఓ వైపు సంగీత్‌ జరుతుంటే చిరంజీవి అపోలో ఆస్పత్రిలో మనవరాలికి ఏమైందో తెలియక టెన్షన్‌ పడ్డారని.. కన్నీళ్లు పెట్టుకున్నారని సీనియర్ జర్నలిస్ట్‌ ప్రభు తెలిపారు.

Next Story