చాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే
సాయాజీ షిండేకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 12 April 2024 2:00 PM ISTచాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన సాయాజీ షిండే
ప్రముఖ నటుడు సాయాజీ షిండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటనతో.. స్లాంగ్‌తో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో కనిపించారు. అయితే.. సాయాజీ షిండే శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఇదే విషయాన్ని సాయాజీ షిండే తన కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో.. వెంటనే స్పందించిన వారు ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ మేరకు సాయాజీ షిండేకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్యుడు సోమనాథ్ మాట్లాడుతూ.. తీవ్రమైన అస్వస్థతో సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారని చెప్పారు. దాంతో.. ఆయనకు పలు వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. దాంట్లో.. తన గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని అన్నారు. గుండెలోని కుడివైపు సిరలు పూర్తిగా మూసుకుపోయినట్లు వైద్యులు చెప్పారు. ముందుగానే ఆంజియోప్లాస్టీ చేస్తామని చెప్పామనీ.. దాంతో సాయాజీ షిండే కూడా సిద్ధం అయ్యారని చెప్పారు. షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని చికిత్స కోసం సిద్దం అయ్యారని వైద్యులు చెప్పారు. పరిస్థితి విషమించకముందే జాగ్రత్తపడ్డామనీ.. విజయవంతంగా ఆంజియోప్లాస్టీ సర్జరీని పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు. రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తామని వైద్యుడు సోమనాథ్ చెప్పారు.
సాయాజీ షిండే తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, మరాఠి, భోజ్‌పురి, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించారు. తెలుగులో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలుత మెగాస్టార్ చిరంజీవి సినిమా ఠాగూర్‌లో చిత్రంతో తెలుగు స్క్రీన్‌పై కనిపించారు. ఆ తర్వాత తాజాగా చివరగా మెగాస్టార్ సినిమా గాడ్ ఫాదర్‌లో కనిపించారు. ఆ తర్వాత నుంచి తెలుగు సినిమా స్క్రీన్‌పై కనిపంచలేదు. గతంలో కూడా సాయాజి షిండేకు చాతిలో నొప్పి వచ్చిందని చెబుతున్నారు. అయితే.. ప్రస్తుతం సర్జరీ పూర్తికావడం.. రెండ్రోజుల్లో డిశ్చార్జ్ కూడా అవుతారని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.