చైతూ, సామ్ మళ్లీ కలుస్తారనుకుంటే ఇలా జరిగిందేంటి..?
సమంత, నాగచైతన్య మళ్లీ కలుస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. కానీ సామ్ షేర్ చేసిన ఫొటోలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 3:15 PM ISTచైతూ, సామ్ మళ్లీ కలుస్తారనుకుంటే ఇలా జరిగిందేంటి..?
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్‌గా నాగచైతన్య-సమంత జంట పేరుతెచ్చుకుంది. కానీ.. పెళ్లయిన కొన్నేళ్లకే ఈ జంట విడిపోయింది. సామ్, చైతూ విడిపోయి దాదాపు రెండేళ్లు గడిసిపోతుంది. ఇప్పటికీ వీళ్లు విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. ఇటీవల సోషల్‌మీడియాలో వీరిద్దరూ మళ్లీ కలుస్తారంటూ ప్రచారం జరిగింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల నాగచైతన్య వద్ద సమంత పెట్ డాగ్ హాష్ కనిపించింది. చైతూ ఆ పెట్‌డాగ్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే.. సామ్ పెట్‌డాగ్ చై దగ్గర కనిపించడంతో వీళ్లిద్దరూ మళ్లీ కలుస్తారనే ప్రచారానికి బలం చేకూరింది. కానీ.. అంతలోనే సమంత అందరికీ షాక్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం రావడంతో.. అభిమానులంతా వారు మళ్లీ కలిస్తే బాగుంటుందని అనుకున్నారు. కానీ.. సమంత తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. పింక్ శారీలో ఉన్న ఫొటోలను సమంత ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. అయితే.. గతంలో సమంత బాడీపై నాగచైతన్య పేరుతో టాటూ ఉండేది. గతంలోనూ ఆ టాటూ కనిపించింది. కానీ.. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మాత్రం ఆ పేరు కనిపించలేదు. దాంతో.. సమంత షేర్ చేసిన ఫొటోలతో అభిమానులు సందిగ్ధంలో పడ్డారు. సామ్, చై కలుస్తారు అనుకుంటే ఇలా జరిగిందేంటంటూ మరోసారి చర్చించుకుంటున్నారు.
నాగచైతన్య పోస్టుతో కలుస్తారులే అని భావించే లోపే.. సమంత ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందేంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. సమంత తన శరీరంపై నాగచైతన్య పేరు టాటూనీ నిజంగానే తొలగించారా.? లేదంటే ఉద్దేశపూర్వకంగా కనిపించకుండా జాగ్రత్త తీసుకుందా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ జంట మళ్లీ కలిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. కాగా.. సమంత షేర్ చేసిన ఫోటోలపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె క్యాషువల్‌గా షేర్ చేసి ఉంటారని.. లోతుగా అర్థాలు వెతకొద్దని అంటున్నారు. ఏదైనా ఉంటే చెప్తారు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.