సమంత కావాలనే అలాంటి పోస్టు పెట్టిందా..!

Samantha Instagram post goes viral.సమంత-అక్కినేని నాగ చైతన్య విడిపోయాక సోషల్ మీడియాలో వాళ్లు పెట్టే పోస్టుల

By M.S.R  Published on  7 Oct 2021 10:04 AM GMT
సమంత కావాలనే అలాంటి పోస్టు పెట్టిందా..!

సమంత-అక్కినేని నాగ చైతన్య విడిపోయాక సోషల్ మీడియాలో వాళ్లు పెట్టే పోస్టుల గురించి ప్రత్యేకమైన అటెన్షన్ ఉండనే ఉంటుంది. ఓ వైపు సమంత ఏమి పెడుతోందో.. సమంత స్నేహితులు ఎలాంటి పోస్టులు పెడుతారోనని అందరూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమంతా సన్నిహితులు ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు.

ఇక సమంత పెట్టిన పోస్టుపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. 'పాత ప్రేమ పాటలు - పర్వతాలు. శిఖరంపై శీతాకాలపు గాలి ధ్వని. కొన్ని పొగొట్టుకున్న పాత చిత్రాల పాటలు దొరికినప్పుడు. లోలోపలి బాధను ప్రతి ధ్వనించే ఆ ప్రేమ పాటలు. పాత బంగ్లాలు, మెట్ల మార్గాలు. సందులలో గాలి శబ్దం' అంటూ సమంత భావోద్వేగమైన పోస్టు పెట్టింది. ఆమె సాధారణంగా పెట్టిన ప్రమోషనల్ పోస్టు అయినప్పటికీ దీనికీ.. ఇటీవలి విడాకులకు లింక్ పెడుతూ కామెంట్లు చేస్తున్నారు. అక్టోబర్‌ 8న జరిగే లాక్‌మీ ఫ్యాషన్‌ షో ప్రమోషన్‌లో భాగంగా సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ షేర్‌ చేసింది. అయితే ఇది ఫ్యాషన్‌ షోకు సంబంధించిన పోస్ట్‌ అయినప్పటీకి ఇందులో సమంత రాసుకొచ్చిన క్యాప్షన్‌లో వేరే అర్థాన్ని వెతుకుతూ ఉన్నారు.

ఇక గతేడాది పెళ్లి రోజు సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ చైతన్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేసి.. ''నేను నీ దాన్ని.. నీవు నా వాడివి.. ఎలాంటి పరిస్థితులైనా రానీ.. మనిద్దరం కలసికట్టుగా వాటిని ఎదుర్కొందాం.. ఆహ్వానిద్దాం.. హ్యాపీ యానివర్సరీ హస్బెండ్‌'' అని క్యాప్షన్‌తో పోస్ట్‌ చేశారు. దాన్ని స్క్రీన్ షాట్ తీసి నెటిజన్లు పోస్టు చేస్తున్నారు.

Next Story