మిమ్మల్ని గర్వపడేలా చేస్తా..సినిమాలకు బ్రేక్‌ ముందు సమంత ఎమోషనల్ పోస్ట్

సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఒక ఎమోషనల్‌ పోస్టు పెట్టారు.

By Srikanth Gundamalla  Published on  14 July 2023 11:32 AM IST
Samantha, Instagram, Emotional Post, Break,

మిమ్మల్ని గర్వపడేలా చేస్తా..సినిమాలకు బ్రేక్‌ ముందు సమంత ఎమోషనల్ పోస్ట్

తెలుగు ప్రేక్షకులకు అతిదగ్గరైన హీరోయిన్లలో ఒకరు సమంత. ఆమె తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ బాగా రాణిస్తున్నారు. కానీ కొంత కాలంగా సమంతను అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ సమస్య నుంచి బయటపడేందుకు సామ్ చికిత్స చేయించుకునేందుకు సిద్ధమైంది. ఒక సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే.. సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్న సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఒక ఎమోషనల్‌ పోస్టు పెట్టారు.

సమంత ప్రస్తుతం చేస్తున్న ఖుషీ సినిమా, సిటాడెల్ షూటింగ్స్‌ పూర్తయ్యాయి. దీంతో.. ఆమె బాధపడుతున్న మయోసైటిస్‌ చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయి వైద్యం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే సమంత ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఆమె ప్రకటనతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. ఇంతకాలం అనారోగ్యంతో ఉన్నా కూడా సినిమాలు, ఇతర షూటింగుల్లో పాల్గొన్నారు. ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టడానికి.. మయోసైటిస్‌ నుంచి కోలుకునేందుకు అమెరికాలో చికిత్స చేయించుకునేందుకు సమంత వెళ్తున్నారు. ఈ క్రమంలో సామ్‌ తన ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ఫ్యామిలీమెన్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్‌ అండ్‌ డీకేలతో సమంతకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు సిటాడెల్‌కు కూడా వీళ్లే డైరెక్టర్స్. తాజాగా సిటాడెల్‌ వర్క్‌ కూడా పూర్తవ్వడంతో రాజ్‌ అండ్ డీకేలతో దిగిన ఫొటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫోటోతో పాటు ఎమోషనల్‌గా టెక్ట్స్‌ కూడా రాసుకొచ్చింది.

సిటాడెల్‌ షూట్‌ పూర్తయ్యిందని తెలిపారు సమంత. తాను తీసుకోబోయే బ్రేక్‌ తనకు తప్పుగా ఏమీ అనిపించడం లేదని అన్నారు. రాబోయే మంచి నాకు తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు సామ్. రాజ్‌ అండ్‌ డీకే తనకు ఫ్యామిలీ లాంటి వారని అన్నారు. ప్రతి యుద్ధంలో తోడుగా, సపోర్ట్‌గా నిలబడ్డారని.. అందుకు వారికి థ్యాంక్స్‌ చెప్పారు సమంత. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పొందలేని విధంగా గర్వపడేలా చేస్తానని అన్నారు. ఇక తనకు మంచి పాత్రను ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు సమంత. మరో మంచి రోల్‌ చేసే వరకు ఇదే తన బెస్ట్‌గా చెప్తూ ఫొటోను షేర్ చేసింది సమంత. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story