ఆ మెయిల్స్‌ను నమ్మకండి..వారికి సల్మాన్‌ఖాన్‌ సీరియస్ వార్నింగ్

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఒక అఫీషియల్ నోట్‌ రిలీజ్‌ చేశాడు.

By Srikanth Gundamalla  Published on  17 July 2023 7:41 PM IST
Salman Khan, Official Note, Movie Casting,

 ఆ మెయిల్స్‌ను నమ్మకండి..వారికి సల్మాన్‌ఖాన్‌ సీరియస్ వార్నింగ్

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఒక అఫీషియల్ నోట్‌ రిలీజ్‌ చేశాడు. దాంట్లో.. తన ప్రొడక్షన్ హౌజ్‌ పేరుతో కొందరు మెయిల్స్‌ పంపిస్తున్నారని.. అలాంటి ఎవరూ నమ్మొద్దని కోరారు. ఆ తర్వాత అలాంటి మెయిల్స్‌ పంపుతున్నవారిని వదిలిపెట్టనని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. సల్మాన్‌ఖాన్ నిర్మించబోతున్న కొత్త సినిమాకు నటీనటులు కావాలని ఎంపిక జరుగుతోందని, ఆసక్తి ఉంటే సంప్రదించండి అంటూ కొందరికి ఈమెయిల్స్‌ వెళ్లాయి.

సల్మాన్‌ఖాన్ నటుడిగానే కాదు.. ‘సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌’ అనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశాడు. ఇటీవల వచ్చిన ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ చిత్రం కూడా ఆ ప్రొడక్షన్ లో వచ్చిందే. దాంతో.. సల్మాన్‌ ఫిలిం ప్రొడక్షన్ పేరుతో కొందరు దుండగులు ఫేక్‌ ఐడీని సృష్టించారు. ఆ తర్వాత కొత్త సినిమా నిర్మించబోతున్నామని.. నటీనటులు కావాలంటూ కొందరికి ఈమెయిల్‌ చేశారు. అలా వారిని మోసం చేసి.. డబ్బులు కాజేస్తున్నట్లు సల్మాన్‌ఖాన్ దృష్టికి వచ్చింది. ఈ ఫేక్‌ మెయిల్స్‌పై సీరియస్‌గా స్పందించారు సల్మాన్‌ఖాన్.

తాము ఎలాంటి ఎంపికలు చేయడం లేదని, ఇప్పుడు గాని భవిష్య్‌ ప్రాజెక్టుల కోసం ఎటువంటి క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌ను నియమించలేదని సల్మాల్‌ఖాన్‌ అఫీషియల్ నోట్‌లో పేర్కొన్నారు. కాబట్టి కొందరు కేటుగాళ్లు పంపుతున్న మెయిల్స్‌ను నమ్మొద్దని ఈ సందర్భంగా కోరాడు. ఈ సందర్భంగా మోసాలకు పాల్పడుతున్న వారికి కూడా సల్మాన్‌ఖాన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరుని ఇలా తప్పుడు పనులకు వాడుతున్న వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటానని అన్నారు. చట్టపరంగా ముందుకు వెళ్తానని వెల్లడించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సల్మాన్‌ రిలీజ్‌ చేసిన అఫీషియల్ నోట్‌ వైరల్ అవుతోంది.

ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ టైగర్‌-3 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. చిత్రంలో సల్మాన్‌ఖాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తోంది. నవంబర్‌లో విడుదల కానున్న ఈ మూవీలో.. షారుక్‌ఖాన్‌ అతిథిపాత్రలో కనిపించనున్నారు.

Next Story