ఓటీటీలో సల్మాన్ 'టైగర్-3' స్ట్రీమింగ్.. తెలుగులో కూడా..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్-3 ఓటీటీలోకి వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 7 Jan 2024 4:55 AM GMTఓటీటీలో సల్మాన్ 'టైగర్-3' స్ట్రీమింగ్.. తెలుగులో కూడా..
ఓటీటీలు వచ్చాక థియేటర్లలో విడుదులైన సినిమాలు త్వరగా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. నెల రోజులు అవ్వకముందే ఓటీటీల్లో ప్రసారమవుతున్నాయి కొన్ని సినిమాలు. ఇక బిగ్ హిట్ అయిన సినిమాల కోసం మాత్రం కొంత సమయం పడుతోంది. అయితే.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్నీ భాషల్లోని అనేక సినిమాలో ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. స్టార్ బాలీవుడ్ హీరో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్-3 ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ జంటగా కనిపించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో బాగంగా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న థియేటర్లలో విడుదల అయ్యింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చి.. రేంజ్‌లో హిట్ కాకపోయినా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది.
కాగా.. టైగర్-3 సినిమా డిసెంబర్‌లోనే ఓటీటీకి రావాల్సి ఉంది కానీ.. అలా జరగలేదు. కొద్ది రోజుల పాటు కన్ఫ్యూజన్ కొనసాగింది. అయితే.. ఉన్నట్లుండి జనవరి 7 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే.. తెలుగు వెర్షన్‌లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్ ఖాన్ టైగర్-3 సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. సండే కూడా కావడంతో ఓటీటీ ప్రేక్షకులకు ఇవాళ ఎంటైర్‌టైనర్‌గా మారనుంది టైగర్-3 సినిమా.
యష్‌రాజ్ నిర్మించిన స్పై యూనివర్స్‌లో ఈ సినిమా ఐదో భాగం. గతంలో విడుదలైన ది టైగర్, టైగర్ జిందా, వార్, పఠాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కానీ టైగర్-3 ఒక్కటే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించగా.. మన దేశంలో రూ.339 కోట్లు.. విదేశాల్లో రూ.125 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.