సల్మాన్ ఆ సినిమా సీక్వెల్ ను తీయబోతున్నాడట..!

Salman Khan announces Bajrangi Bhaijaan 2.సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ఎంత పెద్ద‌

By M.S.R  Published on  20 Dec 2021 1:47 PM IST
సల్మాన్ ఆ సినిమా సీక్వెల్ ను తీయబోతున్నాడట..!

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'భజరంగీ భాయ్ జాన్' సినిమా ఎంత పెద్ద‌ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు ఎంతగానో నచ్చిన సల్మాన్ ఖాన్ సినిమాలలో భజరంగీ భాయ్ జాన్ పాత్ర ఒకటి. పాకిస్తాన్‌ కు చెందిన మున్ని (హర్షాలి మెహతా)ని తిరిగి ఇంటికి పంపడానికి సరిహద్దులు దాటిన అమాయకుడిగా సల్మాన్ నటించాడు. ఈ క్యారెక్టర్ లో సల్మాన్ ఖాన్ ను అతని అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. ఈ సినిమా సీక్వెల్‌ ను చేసే ఆలోచన ఉందని సల్మాన్ ఖాన్ తెలిపాడు. డిసెంబర్ 19 ఆదివారం ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ హిందీ ప్రీ రిలీజ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ ఈ విషయాన్ని వెల్ల‌డించాడు.

సల్మాన్ ఖాన్ ఇటీవలే రియాద్‌లోని దబాంగ్ టూర్ నుండి తిరిగి వచ్చాడు. ఆదివారం ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ కార్యక్రమంలో ఎస్ఎస్‌ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్‌లతో కలిసి పాల్గొన్నాడు. భజరంగీ భాయ్ జాన్ 2ని ప్రకటించడానికి సల్మాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. భజరంగి భాయ్ జాన్ కథను ఎస్ఎస్‌ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన సంగతి తెలిసిందే.

భజరంగీ భాయ్ జాన్ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్ ఖాన్ టైటిల్ రోల్ పోషించారు. ఈ చిత్రంలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ మరియు హర్షాలీ మెహతా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జూలై 17, 2015న విడుదలైంది. ఈ చిత్రంలో సల్మాన్ హనుమంతుని భక్తుడైన అమాయకుడైన వ్యక్తిగా నటించాడు. అతను పాకిస్తాన్‌కు చెందిన మున్నీ (హర్షలి) అనే మూగ బాలికను కలుస్తాడు. ఆ పాప అనుకోకుండా భారత్‌లో తప్పిపోతుంది. తనను తిరిగి పాక్ లోని ఆమె ఇంటికి చేర్చడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. భారీ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది.

Next Story