కుటుంబంతో సహా క్వారంటైన్‌లోకి వెళ్లిన స‌ల్మాన్ ఖాన్‌

Salman han in self isolation .. దేశంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గిన‌ట్లుగానే క‌నిపించిన మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది.

By సుభాష్  Published on  19 Nov 2020 12:38 PM GMT
కుటుంబంతో సహా క్వారంటైన్‌లోకి వెళ్లిన స‌ల్మాన్ ఖాన్‌

దేశంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌గ్గిన‌ట్లుగానే క‌నిపించిన మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ఎంతో మంది సెల‌బ్రెటీలు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ స్వీయ నిర్భంలోకి వెళ్లారు. ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండ‌నున్నారు. ఆయ‌న‌ కారు డ్రైవ‌ర్‌తో పాటు వ్య‌క్తిగ‌త సిబ్బందిలోని ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో.. స‌ల్మాన్ ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

లాక్‌డౌన్ స‌డ‌లింపుల్లో భాగంగా షూటింగ్స్ తిరిగి ప్రారంభం కావ‌డంతో.. ప్ర‌భుదేవా ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న రాధే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో స‌ల్మాన్ స‌ర‌స‌న దిశా ప‌టానీ న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో క‌రోనా వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోరుకుంటూ స‌ల్మాన్ వీడియోలు షేర్ చేసిన సంగ‌తి తెలిసిందే.

Next Story
Share it