ప్రభాస్ 'సలార్'.. అర్థం ఏంటంటే..?
Salaar Poster Release .. 'కేజీఎఫ్' చిత్రంతో హీరోలందరిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం
By సుభాష్ Published on 3 Dec 2020 2:00 PM IST'కేజీఎఫ్' చిత్రంతో హీరోలందరిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తరువాత బాహుబలి స్టార్ ప్రభాస్ తో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ట్విట్టర్‌లో కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ తో ప్రభాస్ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. 'ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్' అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ "సలార్" టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులంతా ఈ టైటిల్ అర్థం తెలుసుకునే పనిలోనే ఉన్నారు.
సలార్ కు చాలా అర్థాలు వస్తున్నాయి. సలార్ అంటే ఉర్దులో ధైర్యవంతుడు అయిన నాయకుడు అని అర్థం. ఒక బలహీన తెగకు చెందన వ్యక్తి సలార్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథగా చెబుతున్నారు. టైటిల్ కు తగ్గట్లుగానే ప్రభాస్ ఈ సినిమా కోసం అత్యంత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లోనే ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చారు. వచ్చే జనవరి నుండి 'సలార్' ను ప్రారంభించబోతున్నారు. రాధేశ్యామ్ ముగిసిన వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది.