'సలార్‌' మూవీ నుంచి వీడియో సాంగ్ విడుదల

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సలార్.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 10:38 AM IST
salaar movie, video song, release, prabhas ,

'సలార్‌' మూవీ నుంచి వీడియో సాంగ్ విడుదల

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్‌ నీల్ కాంబినేషన్లో వచ్చిన సినిమా సలార్. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తుండటంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగురోజులుగా ఆయన ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ప్రభాస్‌ కటౌట్‌కు తగిన యాక్షన్‌ సీన్లు.. ఎలివేషన్లు ఉన్నాయని అంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ సినిమా థియేటర్లలో నడుస్తుండగానే ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఒక గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

థియేటర్లలో ఇప్పటికే ఓ రేంజ్‌లో ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్‌లో సలార్‌ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. 'వినరా.. ఈ పగలు.. వైరం మధ్యన త్యాగంరా.. వినరా రగిలే మంటల మధ్య మంచేరా, వినరా మరిగే గరళం మధ్యన జీవం రా' అంటూ ఈ పాట సాగుతుంది. సలార్‌ సినిమా ఇద్దరు స్నేహితుల మధ్య కొనసాగే కథ. హీరోగా ప్రభాస్‌.. అతని స్నేహితుడు పృథ్వీ రాజ్‌సుకుమారన్‌ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్‌తోనే ఈ కథ మొదలవుతుంది. అలాంటి వీరి స్నేహంపై ఎమోషన్స్‌తో కూడిన పాటే వినరా. ఇదే సాంగ్‌ను చిత్ర యూనిట్‌ యూట్యూబ్‌లో విడుదల చేసింది. థియేటర్లో ఓవైపు సినిమా ఉర్రూతలూగిస్తుంటే.. ఈ పాట వీడియో పూర్తిగా యూట్యూబ్‌లో విడుదల కావడంతో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు ప్రభాస్‌ అభిమానులు.

వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్‌ 22న సలార్‌ సినిమా విడుదలైన విషయం తెలిసింది. రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. రోజురోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించగా.. ప్రధాన పాత్రల్లో పృథ్విరాజ్‌ సుకుమారన్, జగపతిబాబు, శ్రియారెడ్డి సహా తదితరులు నటించారు. ఇక సలార్‌ రెండో పార్ట్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Next Story