రేపే ఓటీటీలోకి 'సలార్' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సినిమా సలార్. ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 11:15 AM ISTరేపే ఓటీటీలోకి 'సలార్' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సినిమా సలార్. బాహుబలి తర్వాత ఆయన వరుసగా సినిమాలు తీశారు కానీ.. అనుకున్నంత హిట్ పడలేదు. దాంతో.. ఈసారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సినిమా అభిమానులకు ఇవ్వాలనే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమాలో నటించాడు. ముందుగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తద్వారా డార్లింగ్ అభిమానులకు 2023లో తీపి జ్ఞాపకాలను అందించింది. భారీ యాక్షన్ సీన్స్.. డైలాగ్స్‌లతో ఉర్రతలూగించిన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తుంది
థియటర్లలో చూసిన అభిమానులు ప్రభాస్ కటౌట్‌కు అసలైన న్యాయం ప్రశాంత్ నీల్ చేశాడని చెప్పారు. యాక్షన్ సీన్స్ మాత్రం కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ సినిమా మరోసారి ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి వరకు థియేటర్లలో నడిచిన ఈ సినిమా.. ఇంకా కూడా కొన్ని థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఈ లోపే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సలార్ సినిమాను జనవరి 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది. దాంతో.. ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ముందుగా జనవరి 26న లేదంటే ఫిబ్రవరి మొదటివారంలో ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. కానీ.. ఈ వార్తలను తలకిందులు చేస్తూ నెట్‌ఫ్లిక్స్ ముందుగానే అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో థియేటర్లలో ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూడటానికి రెడీ అవుతున్నారు. కాగా.. ఈ మూవీలో ప్రభాస్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో పృథ్విరాజ్ సుకుమారన్ నటించగా.. హీరోయిన్‌గా శృతిహాసన్, ఈశ్వరిబాయ్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.