ప్రభాస్ 'సలార్' మూవీ తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్'. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 9:45 AM ISTప్రభాస్ 'సలార్' మూవీ తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'సలార్'. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది సలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీకి మొదటి రోజే హిట్ టాక్ వచ్చింది. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సలార్ రికార్డు కలెక్షన్లను రాబడుతోంది. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా ఒక ఫెస్టివల్‌గా ఉందని చెబుతున్నారు. బ్లాక్‌బాస్టర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 22న విడుదలైన సలార్ మూవీ తొలిరోజు కలెక్షన్లు అదిరిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వసూళ్లు రాబట్టింది. శుక్రవారం ఒక్కరోజే మొత్తం రూ.175 కోట్లకు పైగా వసూలు అయ్యాయని తెలుస్తోంది. ఈ మొత్తంలో దేశీయంగా రూ.135 కోట్లు ఉండటం గమనార్హం. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్‌నిల్క్ కథనం ప్రకారం.. దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూ.49 కోట్లు కాగా.. శుక్రవారం ఒక్కరోజే రూ.60 కోట్లు దాటాయి. సలార్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్‌లో ఆన్‌లైన్ బుకింగ్స్ రూ.42 కోట్లు దాటాయి.
ప్రస్తుతం వీకెండ్ కావడంతో వసూళ్లు ఈ రెండ్రోజుల పాటు మరింత పెరుగతాయని భావిస్తున్నారు. ఇక ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు సలార్ పార్ట్-2కి సంబంధించిన టైటిల్ కూడా ఖరారు చేశారు. 'శౌర్యాంగ పర్వం' టైటిల్‌ను సలార్-2కి ఖరారు చేశారు. ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన శృతిహాసన కనిపించగా.. పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతో పాటు ఇతర భాషల్లో ఈ సలార్ మూవీ విడుదలైంది. షారుక్‌ఖాన్ డంకీ కూడా విడుదలైనా.. సలార్ దెబ్బకు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం స్క్రీన్లు సలార్‌కే కేటాయించారు.