షూటింగ్ స్పాట్‌లో సాయి పల్లవి ఇలా ఉంటుంది.. తండేల్ టీమ్ బర్త్‌డే గిఫ్ట్
హీరోయిన్ సాయిపల్లవి 'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.
By Srikanth Gundamalla Published on 9 May 2024 12:14 PM ISTషూటింగ్ స్పాట్‌లో సాయి పల్లవి ఇలా ఉంటుంది.. తండేల్ టీమ్ బర్త్‌డే గిఫ్ట్
హీరోయిన్ సాయిపల్లవి 'ఫిదా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత ఆమె నటన.. ఆమె అందంతో అందరినీ ఫిదా చేసేసుకుంది. తెలంగాణ యాస మాట్లాడటం చూసిన ప్రేక్షకులు.. సాయిపల్లవిని ఇంట్లో మనిషిగా చేసేసుకున్నారు. అంతలా ప్రేమించేస్తున్నారు. ఫిదా తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్ అయ్యాయి. ఆమె చేసిన ప్రతీ పాత్ర ప్రేక్షకులతో పాటు.. విమర్శకులనూ మెప్పించాయి. అయితే.. ఇవాళ సాయిపల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'తండేల్' చిత్ర యూనిట్ ఒక వీడియోను విడుదల చేసింది.
అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి మరోసారి జంటగా నటిస్తోన్న సినిమా 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సాయిపల్లవి బర్త్‌డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సాయి పల్లవిపై స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది. వీడియో విడుదల చేసిన చిత్ర యూనిట్.. సాయిపల్లవి పాత్ర తండేల్ మూవీలో ఎలా ఉంటుందనేది రివీల్ చేస్తారని అనుకున్నారు. కానీ.. ఆమె తెరపై ఉన్న వీడియో కాదు విడుదల చేసింది.. ఆఫ్ స్క్రీన్‌లో సాయిపల్లవి ఎలా ఉంటారనేది తెలిపారు. షూటింగ్ స్పాట్‌లో ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అల్లరి చేస్తుంది.. చిలిపితనం.. పాత్రలో ఉన్న సమయంలో ఎమోషన్స్ సీన్స్.. ఇలా అన్నింటినీ కలిపి వీడియోను విడుదల చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు.. సాయిపల్లవి అభిమానులు చాలా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ నటి మాత్రమే కాదనీ.. సాయిపల్లవి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అంటూ బర్త్‌డే విషెస్ చెప్పారు తండేల్ మూవీ టీమ్.
ఇక ఈ తండేల్ మూవీని దసరా పండుగకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. దేశభక్తి అంశాలతో రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తండేల్ కావడం విశేషం. ఈ సినిమాలో పాకిస్థాన్‌కి పట్టబడిన భారత మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య నటిస్తున్నాడు. తండేల్ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.