కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. ఏమి చెప్పాడంటే

Sai Dharam Tej makes first appearance after bike accident.సాయి ధరమ్ తేజ్.. యాక్సిడెంట్ కు గురవ్వడంతో అందరూ షాకయ్యారు.

By M.S.R  Published on  6 Nov 2021 12:03 PM IST
కోలుకున్న సాయి ధరమ్ తేజ్.. ఏమి చెప్పాడంటే

సాయి ధరమ్ తేజ్.. యాక్సిడెంట్ కు గురవ్వడంతో అందరూ షాకయ్యారు. సాయి ధరమ్ తేజ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడని మెగా హీరోలు చెప్పారు. సెప్టెంబరు 10న బైక్ పై ప్రయాణిస్తూ హైదరాబాదులో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సాయి హాజరయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోను చిరంజీవి పంచుకున్నారు.

సాయి.. ఈ ఫోటోను షేర్ చేసి.. ఇది తనకు ఇది పునర్జన్మ వంటిదని తెలిపాడు. నా పునర్జన్మకు కారణమైన మీ ప్రేమకు, మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అంటూ భావోద్వేగ పోస్టు పెట్టాడు సాయి. మీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.

సాయిధరమ్‌ తేజ్‌ ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే 'రిపబ్లిక్‌' సినిమా విడుదల అయ్యింది. దేవ క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 1 విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తేజ్ ఐఏఎస్‌ అధికారిగా నటించి మెప్పించారు. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య రాజేశ్ న‌టించింది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ద‌మైంది. జీ 5 ఈ చిత్ర ఓటీటీ హ‌క్కుల‌ను భారీ మొత్తానికి ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 26న ఈ చిత్రం జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Next Story