సాయిధరమ్ తేజ్ బర్త్‌డే: 'గాంజా శంకర్' ఊరమాస్ గ్లింప్స్
సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా 'గంజా శంకర్' నుంచి గ్లింప్స్ విడుదలైంది.
By Srikanth Gundamalla Published on 15 Oct 2023 5:43 AM GMTసాయిధరమ్ తేజ్ బర్త్‌డే: 'గాంజా శంకర్' ఊరమాస్ గ్లింప్స్
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా సంపత్ నందితో కలిసి ఒక సినిమా చేస్తున్న విషం అందరికీ తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇవాళ సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మూవీకి అధికారికంగా టైటిల్‌ను ఖరారు చేసింది. 'గాంజా శంకర్' అనే పేరుని ఫైనల్ చేస్తూ మాస్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో చిన్నపాప డైలాగ్స్‌తో ప్రారంభం అవుతుంది.
చిన్నారి తన నాన్నను కథ చెప్పమని కోరుతుంది. దానికి ఆమె తండ్రి సూపర్‌మ్యాన్ అని చెప్పబోతుంటే.. స్పైడర్ మ్యాన్.. సూపర్ మ్యాన్న్ కాదు.. మన లోకల్ మ్యాన్ కథ ఉంటే చెప్పు అంటుంది. దాంతో.. 'గంజా శంకర్' మూవీ ఇంట్రో ప్రారంభం అవుతుంది. ఈ మూవీలో మాస్‌గా కనిపిస్తున్నారు సాయిధరమ్ తేజ్. గ్లింప్స్ చివర్లో సాయిధరమ్ తేజ్ గురించి చెప్పిన డైలాగ్ అందరినీ ఆకర్షిస్తోంది. పది రూపాయలు ఉంటే పార్క్‌లో పడుకుంటాడు.. అదే పదివేలు ఉంటే పార్క్ హయత్‌లో పడుకుంటాడు అనే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. నిమిషం 40 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మాస్ సీన్స్ ఇందులో చాలా ఉండొచ్చనే అంచనా మొదలైంది. అయితే.. డైరెక్టర్ సంపత్ నందికి కూడా మాస్ దర్శకుడు అనే పేరుంది. దాంతో.. ఈ మూవీపై హైప్స్ ఉన్నాయి. కాగా.. సితారా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ధమాకా, బలగం వంటి హిట్ చిత్రాలకు క్రేజీ మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో గంజా శంకర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈమూవీ కోసం భీమ్స్ సిసిరోలియే అందించిన బ్యాక్‌గ్రౌండ్ సూపర్‌గా ఉందంటూ నెటిజన్లు చెబుతున్నారు.
Here's the FIRST HIGH of #GaanjaShankar & this one will be special.Pretty sure you all will like as I embark to explore a new shade of me with this.Glad to associating for this with @IamSampathNandi Garu, @vamsi84 #BheemsCeciroleo @RishiPunjabi5 @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/9NXK7vmFkB
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 15, 2023