ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' మూవీ
కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.
By Srikanth Gundamalla Published on 29 Nov 2023 4:05 PM ISTఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' మూవీ
థియేటర్లలో ఆడిన సినిమాలు.. మళ్లీ టీవీల్లో చూడాలంటే ఒకప్పుడు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేంది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక ఆ పరిస్థితులు మారిపోయాయి. కేవలం 40 రోజుల్లోనే ఏ సినిమా అయినా అందుబాటులోకి వస్తుంది. ఇక చిన్న సినిమాలు అయితే కొన్ని డైరెక్ట్‌గా ఓటీటీల్లో దర్శనం ఇస్తున్నాయి. అయితే.. తాజాగా కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి జంటగా నటించిన సినిమా 'రూల్స్ రంజన్' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. దివ్యాంగ్ లవానియా, మురళీకృష్ణ వేమూరి రూల్స్ రంజన్ సినిమాను నిర్మించారు. కాగా.. ఈ మూవీ అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. అయితే.. ఈ మూవీ అనుకున్నంతగా మెప్పించలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. వెన్నెల కిశోర్, ఆది కామెడీ మాత్రమే కాస్త మెప్పించాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా నవంబర్ 30న సాయంత్రం 6 గంటల నుంచి రూల్స్ రంజన్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆహా ఒక ప్రకటన విడుదల చేసింది.
మూవీలో సుబ్బరాజు, హర్ష చెముడు, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు. గతంలో గోపీచంద్ ఆక్సిజన్, నీ మనసు నాకు తెలుసుతో పాటు మరికొన్ని సినిమాలకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా.. మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ ఫెయిల్యూర్స్ కిరణ్ అబ్బవరం ఖాతాలో చేరాయి. నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ ఉంటే.. కేవలం కోటిన్నర వరకు మాత్రమే వసూళ్లను రాబట్టింది.