ఘనంగా 'కాంతార' మూవీ హీరో రిషబ్ శెట్టి బర్త్‌డే వేడుకలు
'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా బెంగళూరులో జరిగాయి.
By Srikanth Gundamalla Published on 9 July 2023 4:49 PM ISTఘనంగా 'కాంతార' మూవీ హీరో రిషబ్ శెట్టి బర్త్‌డే వేడుకలు
'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా బెంగళూరులో జరిగాయి. జూలై 7న రిషబ్ శెట్టి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి ప్రగతి రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ప్రారంభించారు. బర్త్‌డే వేడుకల్లో భాగంగా ఫౌండేషన్‌ను ప్రారంభించారు. వేడుకల్లో రిషబ్ శెట్టి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాంతార సినిమా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత ఏడాది విడుదలైన కన్నడ చిత్రం కాంతార అక్కడ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదలై ఘన విజయాన్ని మూటగట్టుకుంది. రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార-2' ప్రీ పొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.
బెంగళూరులో రిషబ్‌శెట్టి మాట్లాడుతూ.. 'పల్లెటూరి నుంచి ఎన్నో కలలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ఇవాళ మీ అందరి అభిమానాన్ని చూరగొన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కన్నడ ప్రేక్షకులు నన్ను ఆదరించడంతో ఈ సినిమా గ్లోబల్ సినిమా అయ్యింది. నన్ను చూడటం కోసం అభిమానులు పడుతున్న ఆరాటాన్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. వానను లెక్కచేయకుండా వచ్చారు. అభిమానుల అంకితభావం పట్ల గౌరవం పెరిగింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అభిమానాన్ని గుండెల్లో దాచుకుంటాను. అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.' అని రిషబ్ శెట్టి అన్నారు.
విద్యా ప్రాముఖ్యతను చాటడానికి రిషబ్ శెట్టి ఫౌండేషన్‌ను ఆయన సతీమణి ప్రగతి శెట్టి ప్రారంభించారని ప్రమోద్ శెట్టి అన్నారు. చాలా ఏళ్లుగా రిషబ్ శెట్టి కర్ణాటకలోని పలు ప్రభుత్వ స్కూల్స్‌కు తన వంతు సాయం చేస్తున్నారని అన్నారు. అయితే రిషబ్ శెట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ పంచుకోలేదని.. చెప్పుకోవడం ఆయనకు ఇష్టం ఉండదని అన్నారు ప్రమోద్ శెట్టి.
కర్ణాటకనే కాదు.. ఇంత ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులను చూసి ఎంతో సంబరడిపోయారు రిషబ్ శెట్టి. గంటల తరబడి ఆయన వేదికపైనే ఉండి ఫ్యాన్స్‌ని పేరు పేరున పలకరించారు. దాంతో అభిమానులు కూడా ఆనందంలో మునిగితేలారు.