రవితేజ దండయాత్ర.. 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తోన్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 4:13 PM ISTరవితేజ దండయాత్ర.. 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తోన్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. సూపర్ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. టైగర్ దండయాత్ర అంటూ టీజర్‌ను విడుదల చేశారు. 1970లో దేశంలో అతిపెద్ద దొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం 'నాగేశ్వరరావు' జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. యంగ్ డైరెక్టర్ వంశీ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో.. యాక్షన్ సీన్స్‌తో విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా రేంజ్‍లో రూపొందుతోంది. టీజర్ కూడా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ అయింది.“హైదరాబాద్, బాంబే, ఢిల్లీ ఇంకా అనేక నగరాల్లో దారుణంగా దోపిడీలు చేసిన స్టువర్టుపురం దొంగ మద్రాసు సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు” అనే వార్త వాయిస్ ఓవర్‌తో టైగర్ నాగేశ్వరరావు టీజర్ మొదలైంది. నాగేశ్వరరావు కోసం దేశవ్యాప్తంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తుంటారు. మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ గురించి చెప్పిన లెంతీ డైలాగ్ అదిరిపోయింది. ఆ డైలాగ్ తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. పులి, సింహం కూడా ఓ వయసు వచ్చేదాక పాలే తాగుతాయి..కానీ వీడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలుపెట్టాడ అంటూ మురళీ శర్మ చెప్పే డైలాగ్ చూస్తుంటే టైగర్ క్యార్టెక్టర్ ఎంత పవర్‌ఫుల్‍గా ఉంటుందో అర్థమవుతోంది. బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న ట్రైన్‌కు తాడు వేసి రవితేజ చేసిన యాక్షన్ సీన్ హైలెట్‌గా నిలిచింది. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా సాగింది.
సూపర్బ్ డైలాగ్స్.. అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్న టీజర్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్‍తో నిర్వాస్తోన్న టైగర్ నాగేశ్వరరావు సినిమా ఈ ఏడాది అక్టోబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. రవితేజ పకకన నుపుర్ సనన్, గయాత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రేణుదేశాయ్ థియేటర్లలో ఈ సినిమాలోనే కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషించారు.