'ది గర్ల్‌ఫ్రెండ్'..లేడీ ఓరియెంటెడ్ మూవీతో వస్తోన్న రష్మిక
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 2:30 PM IST'ది గర్ల్‌ఫ్రెండ్'..లేడీ ఓరియెంటెడ్ మూవీతో వస్తోన్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మికకు అభిమానులు చాలా ఎక్కువ. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే టాప్ హీరోయిన్‌గా మారింది. నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఇక పుష్ప సినిమా తర్వాత అయితే నేషనల్ క్రష్‌గా మారింది. పుష్పలో యాక్టింగ్ ఇరగదీసింది. దాంతో.. పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు గుర్తింపు వచ్చింది. అయితే.. రష్మిక ఇప్పటి వరకు దాదాపుగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. కానీ.. ఇప్పుడు రూట్ మార్చి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. 'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మేరకు గ్లింప్స్‌ను కూడా మేకర్స్ వదిలారు. ప్రాణం కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తుందనుకునే ఓ కుర్రాడు.. ఆ కుర్రాడిని ప్రేమించడానికి సర్వం కోల్పోయాననుకుని లోలోపల భరించలేని బాధ అనుభవించే అమ్మాయి. వీరిద్దరి ప్రేమ గాధ ఏలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కినట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.
ది 'గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం కూడా చేస్తోంది రష్మిక మందన్న. 'రెయిన్ బో' అనే లేడీ ఓరియంటెడ్ సినిమాను ఆమె ఇప్పటికే ప్రారంభించింది. ఈ చిత్రంతో శాంతరూబన్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మికతో పాటు దేవ్ మోహన్ నటించనున్నాడు. అయితే.. తాజాగా విడుదలైన గర్ల్‌ఫ్రెండ్ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.