మేనేజర్ నుండి విడిపోయి నిజాన్ని బయటపెట్టిన రష్మిక
కలిసి పనిచేయకపోవడంపై రష్మిక, ఆమె మేనేజర్ కీలక ప్రకటన చేశారు. తాము విడిగా పనిచేస్తోందని నిజమే అని చెప్పారు
By Srikanth Gundamalla Published on 22 Jun 2023 8:52 PM ISTమేనేజర్ నుండి విడిపోయి నిజాన్ని బయటపెట్టిన రష్మిక
హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్ అని పేరు సంపాదించుకున్న ఆమె.. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే.. రష్మికకు ఇటీవల ఓ షాకింగ్ సంఘటన ఎదురైందని వార్తలు వచ్చాయి. ఆమె మేనేజర్ తన నుంచి రూ.80 లక్షల వరకు కాజేశాడని.. అందుకు రష్మిక అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత ఉద్యోగం నుంచి తీసేసినట్లు కూడా ప్రచారం జరిగింది. ఎన్ని వార్తలు వచ్చిన రష్మిక వెంటనే స్పందించలేదు. కలిసి పనిచేయకపోవడంపై రష్మిక, ఆమె మేనేజర్తా తాజాగా కీలక ప్రకటన చేశారు.
తాము విడిగా పనిచేస్తోందని నిజమే అని చెప్పారు రష్మిక మందన్న, ఆమె మేనేజర్. దీనికి వెనుక ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. ఇంతకాలం ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామన్నారు. పరస్పర ఒప్పందంతోనే విడిగా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు రష్మిక, ఆమె మేనేజర్ తెలిపారు. ప్రొఫెషనల్‌గా ఉండే వాళ్లమని.. అలాగే కలిసి ఇన్నాళ్లు కలిసి పనిచేశామని చెప్పారు. ఇప్పుడు కూడా అంతే హుందాగా విడిగా పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రష్మిక మందన్న, ఆమె మేనేజర్ ప్రకటనలో తెలిపారు. ఇటీవల వార్తల్లో వచ్చిన కథనాలను కొట్టిపారేశారు.
కాగా.. రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప-ది రూల్‌లో నటిస్తోంది. రెయిన్‌బో అనే ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది. బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌కు జంటగా యానిమల్ మూవీలో కనిపంచబోతుంది రష్మి, యాక్షన్ డ్రామా థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.