సమంతపై ప్రేమ కురిపించిన రష్మిక

Rashmika Mandanna comments on Samantha. రష్మిక ఆ విషయంపై మాట్లాడుతూ సమంతపై ఎంతో ప్రేమ కురిపించింది.

By M.S.R  Published on  4 Jan 2023 3:21 PM IST
సమంతపై ప్రేమ కురిపించిన రష్మిక

సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ కు ఎప్పుడూ పడదు అనే డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పటి హీరోయిన్స్ మాత్రం అలా కనిపించడం లేదు. తాజాగా రష్మిక మందాన కామెంట్స్ చూస్తే.. ఒక హీరోయిన్.. మరో హీరోయిన్ విషయంలో కేర్ తీసుకుంటారని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సమంత అనారోగ్యం గురించి గత కొద్ది కాలంగా విపరీతమైన చర్చ జరిగింది. తాజాగా రష్మిక ఆ విషయంపై మాట్లాడుతూ సమంతపై ఎంతో ప్రేమ కురిపించింది.

'సమంత వండర్‌ఫుల్‌ లేడీ. చాలా మంచి మహిళ. ఆమె విషయంలో ఒక అమ్మలా నేను తనకు రక్షణ కల్పించాలనుకుంటాను. సమంత తన ఆరోగ్య పరిస్థితిని బయటకు చెప్పే వరకూ నాకూ ఏమీ తెలియదు. మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ఏనాడూ చెప్పలేదు. ఏదేమైనా ఆమెకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న సమంత నుంచి అందరిలాగే నేను కూడా స్ఫూర్తి పొందుతాను' అని రష్మిక వారిసు సినిమా ప్రమోషన్స్ లో వ్యాఖ్యలు చేసింది. రష్మిక సమంత గురించి అంత పాజిటివ్ గా మాట్లాడడం సమంత అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.

Next Story