రామ్‌చరణ్‌ కూతురు ఫేస్‌ చూశారా.. సో బ్యూటిఫుల్‌ (వీడియో)

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన సతీమణితో కలిసి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  27 March 2024 11:02 AM IST
ram charan, daughter, klin kaara, face,

రామ్‌చరణ్‌ కూతురు ఫేస్‌ చూశారా.. సో బ్యూటిఫుల్‌ (వీడియో)

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తన భార్య ఉపసాన, కూతురు క్లింకారతో పాటుగా రామ్‌చరణ్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాత సేవలో కూడా ఆయన పాల్గొన్నారు. బుధవారం ఉదయం ఆలయానికి వెళ్లిన రామ్‌చరణ్‌ దంపతులకు ఆలయ అధికారుల స్వాగతం పలికారు. ఆ తర్వాత దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

రామ్‌చరణ్‌ దంపతులు కూతురుతో పాటు తిరుమలకు వెళ్లిన వీడియోలు సోషల్‌ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార ముఖాన్ని చూపించలేదు. కానీ.. తాజాగా తిరుమలలో రికార్డైన వీడియోలో క్లింకార ముఖం కనిపించించింది. దాంతో.. క్లింకారా ఫేస్‌ రివీల్‌ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. క్లింకార ఎంతో క్యూట్‌గా ఉంది.. మొదటిసారి ఆమె ఫేస్‌ కనించడం అంటూ లైక్స్ కొడుతూ వీడియోను షేర్‌ చేస్తున్నారు. క్యూట్‌ మెగా ప్రిన్సెస్‌ అంటూ కామెంట్ చేస్తున్నారు. క్లింకార ఫేస్‌ రివీల్ అయిన వీడియో అయితే నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరోవైపు రామ్‌చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చూసినట్లు అయితే.. శంకర్‌ దర్శకత్వంలో 'గేమ్‌చేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మరో సినిమాలో కూడా నటించబోతున్నాడు చెర్రీ. ఉప్పెన మూవీ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో పాన్‌ఇండియా ప్రాజెక్టు చేస్తున్నాడు. ఆర్‌సీ16 టైటిల్‌తో ఈ చిత్రం హైదరాబాద్‌లో ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ కన్ఫమ్ అయ్యింది.


Next Story