రామ్‌చరణ్‌కు జోడీగా సాయిపల్లవి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
రామ్‌చరణ్ 16వ సినిమాలో హీరోయిన్‌పై పలు వార్తలు వినిపించాయి.
By Srikanth Gundamalla Published on 16 Nov 2023 8:30 PM ISTరామ్‌చరణ్‌కు జోడీగా సాయిపల్లవి.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత అందులోని నటులతో పాటు అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్, హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌కు అయితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అయితే... ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉండగా.. రామ్‌చరణ్ కూడా వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది ఆర్‌సీ 16గా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే.. రామ్‌చరణ్ 16వ సినిమాలో హీరోయిన్‌పై పలు వార్తలు వినిపించాయి. రవీనాటాండన్ కుమార్తె రాషా థడానీ (Rasha Thadani), కీర్తిసురేశ్ (Keerthy suresh) అంటూ ఇప్పటికే ఎన్నో పేర్లు వినిపించాయి.ఇప్పుడీ జాబితాలోకి నటి సాయిపల్లవి పేరు వచ్చి చేరింది.
ఫిదా సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది నటి సాయిపల్లవి. ఆ తర్వాత తెలుగులోఎన్నో సినిమాల్లో నటించింది. తన విలక్షణమైన నటన, అందంతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గ్లామర్‌కు, ఎక్స్‌పోజింగ్ కాకుండా నటనకే ప్రాధాన్యమిచ్చే నటి సాయిపల్లవి. అందుకే చాలా తక్కువ సినిమాల్లో ఆమె నటిస్తుంటారు. అయితే, ఇప్పడు తాజాగా రామ్‌చరణ్‌తో సాయిపల్లవి జోడి కట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కాస్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మేరకు చిత్రబృందం సైతం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్‌గా ఉంటే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు.
బుచ్చిబాబు గతంలో 'ఉప్పెన' సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రామ్‌చరణ్‌తోనే సినిమా తీస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా, గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ ఈ మూవీలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ‘గేమ్ ఛేంజర్’ పూర్తైన తర్వాత రామ్‌చరణ్ ఈ సినిమా మొదలుపెట్టనున్నారు.