తాను కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోకు వెళ్లిన రజనీకాంత్ (వీడియో)
రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు జయానగర్ బస్సు డిపోను ఆకస్మికంగా సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 2:55 PM ISTతాను కండక్టర్‌గా పనిచేసిన బస్ డిపోకు వెళ్లిన రజనీకాంత్ (వీడియో)
రజనీకాంత్ వెండితెర సూపర్ స్టార్. తమిళనాడులోనే కాదు.. దేశవ్యాప్తంగా సూపర్ స్టార్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్‌కు గుర్తింపు ఉంది. అయితే.. సూపర్ స్టార్ సినిమా విడుదలైందంటే చాలు.. అభిమానులు ఎంతో సందడి చేస్తారు. ఆయన ఎక్కడ కనిపించినా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడతారు. అభిమానులు రజనీకాంత్‌ను తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. చాలా మంది హీరోల్లా కాదు రజనీకాంత్. సాదాసీదాగా ఉండాలనుకునే వ్యక్తి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎంత ఎత్తుకి ఎదిగినా.. తాను ఎక్కడి నుంచి వచ్చారనే విషయాన్ని మర్చిపోరు. ఓ సామాన్యుడిలానే ఉంటారు. అందుకే అభిమానులు కూడా ఆయన్ని ఎంతగానో ఆరాధిస్తారు. సెలబ్రిటీని అనే ఆలోచన కొంచెం కూడా ఉండదు అయనకి. రజనీకాంత్ ఎక్కువగా ఆధ్యాత్మికంలో కూడా ఉంటారు. హిమలయాలకు వెళ్తుంటారు. ఇటీవల కూడా ఆయన హిమాలయాలకు వెళ్లివచ్చారు. కొన్నిసార్లు ఎక్కువ కాలం అక్కడే గడుపుతుంటారు. సినిమా జీవితాన్ని, సహజ జీవితాన్ని ఎన్నడూ కలిపి చూడరు. కొద్దిరోజుల క్రితం సన్యాసి అయిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి.. ఆయన కాళ్లకు దండం పెట్టిన విషయం కూడా తెలిసిందే. అప్పుడు ఆయన వీడియో వైరల్ అయ్యింది.
తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో మరోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని బెంగళూరు జయానగర్ బస్సు డిపోను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన సినిమాల్లోకి రాకముందు రజనీకాంత్ కండక్టర్ జీవితాన్నే గడిపారు. అందుకే ఎప్పుడు అవకాశం వచ్చినా ఒక్కసారి అయినా బస్సు డిపోకు వెళ్లి సందర్శిస్తుంటారు. తాజాగా డిపోకు వెళ్లిన రజనీకాంత్ కండక్టర్లు, ఇతర స్టాఫ్‌ను పలకరించారు. ఆయన్ని చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. రజనీకాంత్ రాకను తెలుసుకున్న అభిమానులు కూడా సెల్ఫీతో తీసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. పలువురు ఫొటోలు దిగి సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేశారు. కాగా.. ఇటీవల విడుదలైన రజనీకాంత్ సినిమా 'జైలర్' సూపర్ హిట్‌గా నిలిచింది. రికార్డులను తిరగరాస్తోంది. గతంలో రజనీకాంత్ కలెక్షన్లను దాటి ముందుకు దూసుకుపోతుంది. అటు సినిమా హిట్ అవ్వడం.. మరోవైపు రజనీకాంత్ సోషల్‌మీడియాలో కనిపిస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Superstar Rajinikanth paid a surprise visit to depot number 4 of BMTC (Bengaluru Metropolitan Transport Corporation) in Bengaluru, Karnataka today. (Video Source: BMTC) pic.twitter.com/luzdpkdnNh
— ANI (@ANI) August 29, 2023