'జైలర్' సూపర్‌ హిట్.. రజనీకాంత్‌కు డబుల్‌ గిఫ్ట్స్ (వీడియో)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన 'జైలర్‌' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

By Srikanth Gundamalla  Published on  1 Sept 2023 2:12 PM IST
Rajinikanth, Jailer, Super Hit, Movie, Double Gifts,

 'జైలర్' సూపర్‌ హిట్.. రజనీకాంత్‌కు డబుల్‌ గిఫ్ట్స్ (వీడియో)

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ నటించిన 'జైలర్‌' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కలెక్షన్స్‌లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. గతంలో రజనీ సినిమాలకు ఉన్న మార్జిన్లను దాటి కలెక్షన్లు సాధించింది. చాలా రోజుల తర్వాత సూపర్‌ స్టార్‌ ఖాతాలో మరో బ్లాక్‌బాస్టర్ హిట్ నమోదు కావడంతో.. అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఘన విజయాన్ని జైలర్ టీమ్‌ అంతా ఆస్వాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే జైలర్ చిత్రానికి వస్తోన్న వసూళ్ల పట్ల ఆనందంగా ఉన్న నిర్మాత కళానిధి మారన్‌ రజనీకాంత్‌ను కలిశారు. జైలర్‌కు భారీగా కలెక్షన్లు వస్తుండటంతో సూపర్‌ స్టార్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మూవీకి వచ్చిన లాభాల నుంచి కొంత మొత్తం చెక్‌ రూపంలో అందించారు. అలాగే, రెండు బీఎండబ్ల్యూ కార్లను కూడా ఆయన వద్దకు తీసుకెళ్లారు. వాటిల్లో ఒకదాన్ని సెలక్ట్‌ చేసుకోమని కోరారు. దాంతో.. రజనీకాంత్‌ ఆ రెండింటిలో బీఎండబ్ల్యూ ఎక్స్‌7 మోడల్‌ కారుని సెలక్ట్‌ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కాగా.. బీఎండబ్ల్యూ కారు ధర రూ.కోటికి పైగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. తలైవా ఒక్క హిట్‌ కొడితే చరిత్ర తిరగరాస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

జైలర్‌ సినిమా ఆగస్టు 10న విడుదలై థియేటర్లలో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహించగా.. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ దీన్ని నిర్మించారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, జాకీష్రాఫ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Next Story