Thalaivar 170: సాయంత్రం రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ వీడియో

డిసెంబర్ 12న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పుట్టినరోజు. ఆయన బర్త్‌డే రోజుని అభిమానలంతా పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  12 Dec 2023 11:39 AM IST
rajinikanth, birthday,  170th movie,

Thalaivar 170: సాయంత్రం రజనీకాంత్ బర్త్‌డే స్పెషల్ వీడియో 

డిసెంబర్ 12న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పుట్టినరోజు. ఆయన బర్త్‌డే రోజుని అభిమానలంతా పండగలా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తలైవర్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే ఒక న్యూస్‌ వచ్చింది. ప్రస్తుతం రజనీకాంత్ 170వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తలైవర్‌ 170 సినిమా నుంచి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఒక స్పెషల్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. సాయంత్రానికి కల్లా ఈ వీడియోను విడుదలచేస్తామని చెప్పారు. దాంతో.. రజనీకాంత్ అభిమానులంతా ఆ వీడియో ఏంటో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రజనీకాంత్‌ బర్త్‌డే ట్రెండింగ్ నడుస్తోంది. ఇక తలైవర్‌ 170వ సినిమా నుంచి స్పెషల్‌ వీడియో అని చెప్పడంతో నెట్టింట దీని గురించే అంతా చర్చించుకుంటున్నారు.

తలైవర్‌ 170వ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. గతంలో జైలర్‌ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా.. ఆ తర్వాత రిటైర్డ్‌ అయిన ఆఫీసర్‌గా ఉంటాడు రజనీకాంత్. జైలర్‌ భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్లలో రికార్డులను క్రియేట్ చేసింది. తలైవర్‌ 170వ సినిమాలో సస్పెన్షన్‌లో ఉన్న పోలీస్‌గా కనించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కూడా పోలీస్‌ బ్యాగ్రౌండ్ స్టోరీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అంతేకాదు ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇండియన్‌ సూపర్‌ స్టార్స్‌ ఇద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తుండటం.. అది కూడా చాలా ఏళ్ల తర్వాత రిపీట్ కానుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఓ రేంజ్‌లో మాత్రం ఉంటుందని అభిమానులు దీమాగా చెబుతున్నారు. రెగ్యులర్‌ మాస్‌ కమర్షియల్‌ సినిమాల్లా కాకుండా కొత్త కథనాలతో ఈ సినిమాను జ్ఞానవేల్ తీస్తున్నాడు. మరి ఇండియన్‌ సూపర్‌స్టార్స్‌ నటిస్తున్న ఈ సినిమాను డైరెక్టర్‌ ఎంతవరకు సక్సెస్‌ చేస్తాడో చూడాలి.


Next Story